సైకిల్ జోరు ఫ్యాన్ బేజారు.. రాయలసీమలో వైసీపీకి దిమ్మతిరిగే ఫలితాలు!

Reddy P Rajasekhar
2019 ఎన్నికల్లో రాయలసీమలో ఏకంగా 49 స్థానాల్లో విజయం సాధించి వైసీపీ సీమపై తనదైన ముద్ర వేసింది. ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో మూడు పార్టీలు కలిసి పోటీ చేసినా సీమలో పెద్దగా ప్రభావం పడదని కామెంట్లు వినిపించాయి. అయితే ఇక్కడే వైసీపీ అంచనాలు తప్పబోతున్నాయి. కుప్పం, నగరి, పూతలపట్టు, మైదుకూరు, నంద్యాల లోక్ సభ, పాణ్యం ఇలా సీమలోని ప్రధాన నియోజకవర్గాల్లో కూటమి పైచేయి సాధిస్తోంది.
 
ఏపీలోని 175 స్థానాల్లో ఇప్పటివరకు కేవలం 13 స్థానాల్లో మాత్రమే వైసీపీ లీడ్ లో ఉంది. ఇదే సమయంలో కూటమి మాత్రం 55 స్థానాల్లో లీడ్ లో ఉండటం గమనార్హం. రాయలసీమలో వైసీపీకి దిమ్మతిరిగే ఫలితాలు రావడం ఖాయమని తేలిపోయింది. కూటమి అభ్యర్థులు చాలా నియోజకవర్గాల్లో భారీ ఆధిక్యంతో ముందువరసలో ఉన్నారు. హోరాహోరీ పోరు ఉంటుందని అందరూ భావించగా ఫలితాలు వార్ వన్ సైడ్ అనేలా ఉన్నాయి.
 
మ్యాజిక్ ఫిగర్ కు అవసరమైన స్థానాలను కూటమి సులువుగానే సొంతం చేసుకోనుందని తెలుస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీకి ఎంతటి ఘోర పరాజయం ఎదురైందో ఈ ఎన్నికల్లో వైసీపీకి సైతం అలాంటి ఘోర పరాజయం ఎదురు కానుందని తెలుస్తోంది. కడపలో సైతం వైసీపీకి భారీ షాకులు తగులుతున్నాయి. కడప అసెంబ్లీ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి మాధవీరెడ్డి లీడింగ్ లో ఉన్నారు.
 
అంజాద్ బాషాపై వ్యతిరేకత ఉన్నా జగన్ రిస్క్ తీసుకోకపోవడంతో ఇలాంటి పరిస్థితి అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కడప అసెంబ్లీ పరిధిలో ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అంజాద్ బాషా సునాయాసంగా విజయం సాధిస్తారని అందరూ భావించినా అందుకు భిన్నంగా ఫలితాలు వస్తున్నాయి. జూన్ 4వ తేదీ వైసీపీకి భారీ షాకులిచ్చే రోజుగా మిగిలిపోనుందని విశ్లేషకులు చెబుతున్నారు. జగన్ ఐదేళ్ల పాలన ప్రజలకు నచ్చలేదని ఈ ఎన్నికల ఫలితాలు చెప్పకనే చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: