ఈటల దెబ్బకు.. ప్రత్యర్ధుల విలవిల.. టిఆర్ఎస్, కాంగ్రెస్ కు చుక్కలు?

praveen
ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఈ క్రమంలోనే కొన్ని పార్లమెంట్ సెంటిమెంట్లు విజయం ఎవరిది అనే విషయంపై తీవ్ర స్థాయిలో ఉత్కంఠ నెలకొంది. మరి ముఖ్యంగా అటు మినీ ఇండియా గా పిలుచుకునే మల్కాజ్గిరి నియోజకవర్గం లో విజయం ఈసారి ఎవరిని వరించబోతుంది అనే విషయంపై అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసారు. ఎందుకంటే ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇది సిట్టింగ్ స్థానం. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ నుంచి ఎంపీగా 2019 ఎన్నికల్లో గెలిచారు. దీంతో సిట్టింగ్  స్థానాన్ని కాపాడుకోవడం సీఎం రేవంత్ కి ప్రతిష్టాత్మకంగా మారింది. కానీ ఎప్పుడూ అనూహ్యమైన ఫలితాలకు అటు మల్కాజ్గిరి ప్రజలు కారణమవుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే మినీ ఇండియా గా పిలుచుకునే మల్కాజ్గిరిపార్లమెంట్ నియోజకవర్గం లో విజేతగా నిలవబోయేది ఎవరు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే ఇది సీఎం రేవంత్ రెడ్డి సిట్టింగ్ స్థానం కావడం ఇక ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో ఆ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే ఒక్కసారైనా ఇక్కడ విజయం సాధించాలని బిఆర్ఎస్ పార్టీ పట్టుదలతో ఉంది విజయం కోసం ఈ రెండు పార్టీలు ఎన్నో ప్రయత్నాలు చేశాయి.

 కానీ అటు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం ప్రజలందరూ కూడా బిజెపిని నమ్మారు అన్నది తెలుస్తుంది. హుజురాబాద్ ఎమ్మెల్యేగా తిరుగులేని నాయకుడిగా ఎదిగిన మాస్ లీడర్ ఈటల రాజేందర్ కి ఇక అటు మల్కాజ్గిరి ఓటర్లందరూ కూడా పట్టడం కట్టేందుకు రెడీ అయ్యారు. ఈ క్రమంలోని మొదటి రౌండులోనే ఈటల రాజేందర్ కు 11,000 మెజారిటీ వచ్చింది. దీంతో ఈటల దెబ్బకు ప్రత్యర్థులు విలవిలలాడిపోతున్నారు. ఇక బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు ఓటమి తప్పేలా  కనిపించడం లేదు. పూర్తి కౌంటింగ్ పూర్తి అయ్యేసరికి ఈటెల భారీ మెజారిటీతో విజయం సాధించడం పక్క అన్నది తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: