గురి చూసి దెబ్బ కొట్టిన ప్రభుత్వ ఉద్యోగులు... రాష్ట్రంలో వైసీపీ కథ కంచికేనా?

Reddy P Rajasekhar
ఏపీ సీఎం వైఎస్ జగన్ కు ప్రభుత్వ ఉద్యోగులు దిమ్మతిరిగే షాకిచ్చారా? పోస్టల్ బ్యాలెట్ ఉద్యోగుల ఓట్లు కూటమికే పడ్డాయా ? అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. రాష్ట్రంలో దాదాపుగా 33 స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. మరోవైపు మెజారిటీ నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు వెనుకంజలో ఉన్నారు. టీడీపీ 28 స్థానాల్లో లీడ్ లో ఉంటే జనసేన 5 స్థానాల్లో లీడ్ లో ఉండటం గమనార్హం.
 
జగన్ ఎన్నో ఆశలు పెట్టుకున్న రాయలసీమలో సైతం ఈసారి లెక్కలు మారుతున్నాయి. చంద్రబాబు, లోకేశ్, బుచ్చయ్య చౌదరి లాంటి కీలక నేతలు లీడ్ లో ఉండటం పార్టీ శ్రేణులకు ఆనందాన్ని కలిగిస్తోంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ లీడ్ లో ఉండగా తెనాలిలో నాదెండ్ల మనోహర్ లీడ్ లో ఉండటం గమనార్హం. వైసీపీకి అనుకూల నియోజకవర్గమైన పూతలపట్టులో సైతం మురళీ మోహన్ లీడ్ లో ఉన్నారు.
 
ఏపీలో సైకిల్ జోరు మామూలుగా లేదని ఇండియా టుడే సర్వే లెక్కలు నిజం కానున్నాయని తెలుస్తోంది. కేవలం సంక్షేమాన్ని నమ్ముకుని వైసీపీ తప్పు చేసిందని ఈ ఎన్నికల ఫలితాలతో అందుకు సంబంధించి మూల్యం చెల్లించుకోనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పిఠాపురంలో ఎక్కువ సంఖ్యలో చెల్లని ఓట్లు నమోదైన నేపథ్యంలో ఇరు పార్టీలు ఏం చేస్తాయో చూడాల్సి ఉంది.
 
నంద్యాల లోక్ సభ నియోజకవర్గంలో బైరెడ్డి శబరి ముందంజలో ఉన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 1000కు పైగా ఓట్ల ఆధిక్యంతో ఉండటం గమనార్హం. నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రోజాకు షాక్ తగలడం ఖాయమని తేలిపోయింది. జగన్ సొంత జిల్లా కడపలోని మైదుకూరులో కూటమి అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ లీడ్ లో ఉండటం గమనార్హం. వైసీపీ మైండ్ బ్లాంక్ అయ్యే ఫలితాలు ఈ ఎన్నికల్లో రానున్నాయని సమాచారం అందుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: