తల పట్టుకుంటున్న కేసీఆర్.. ఈ రిజల్ట్ చూస్తే అంతే మరి?

praveen
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు సార్లు అధికారం చేపట్టి తిరుగు లేని పార్టీగా ఎరిగిన బిఆర్ఎస్ పార్టీకి ఒకసారి ప్రతిపక్షం లోకి రాగానే విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అన్న విషయం తెలిసిందే. ఆ పార్టీ ప్రతిపక్షం లోకి వచ్చిందో రాలేదో చివరికి గులాబీ పార్టీ లోని కీలక నేతలందరూ కూడా పార్టీని వీడి అధికారం లో ఉన్న కాంగ్రెస్ గూటికి చేరుకున్నారూ. ఈ క్రమం లోనే రానున్న రోజుల్లో మిగతా నేతలు కూడా కారు పార్టీని వీడే అవకాశం ఉంది అని అందరూ అంచనా వేశారు.

 ఇలాంటి పరిస్థితుల్లో వచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటడం అటు గులాబీ పార్టీకి తప్పనిసరిగా మారిపోయింది. అయితే కేసీఆర్ బరిలోకి దిగి ఇక  తమ పార్టీ అభ్యర్థులు అందరినీ గెలిపించుకునేందుకు తీవ్రంగా శ్రమించినప్పటికీ.. ఇక ఫలితం లేకుండా పోయింది అన్నది అర్థమవుతుంది.  ఇటీవల విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలలో టిఆర్ఎస్ పార్టీ ఒక్క విజయం కూడా లేదు అని చెప్పాయి. అయితే చెప్పినట్లుగానే ఇప్పుడు కౌంటింగ్ లో కూడా ఇదే జరుగుతుంది అన్నది తెలుస్తుంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆరు స్థానాలలో... రాష్ట్రంలో పట్టు సాధించిన బిజెపి పార్టీ ఏడు స్థానాలలో లీడింగ్ లో కొనసాగుతోంది. మరోవైపు తమ కంచు కోటా అయిన హైదరాబాదులో ఎంఐఎం ఎప్పటిలాగానే లీడ్ లో ఉంది. కానీ బిఆర్ఎస్ పార్టీ మాత్రం ఒక్క దగ్గర కూడా లీడ్ సాధించకపోవడం గమనార్హం.  ఈ రిజల్ట్స్ అటు కెసిఆర్ దిమ్మతిరిగేలా చేస్తున్నాయని అర్థమవుతుంది. ఈ క్రమంలోనే ఒక సీట్ కూడా రాకపోతే కేసీఆర్ పరువు పోవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. అదే సమయంలోకారు పార్టీ ఖాళీ కావడం ఖాయమని అంచనా వేస్తున్నారు. పూర్తి కౌంటింగ్ పూర్తయ్యేసరికి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Kc4

సంబంధిత వార్తలు: