ఏపీలో ఎక్కడ చూసినా కూటమిదే ఆధిక్యం.. బాబు చరిత్ర తిరగరాస్తారా?

Reddy P Rajasekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు, ఈవీఎం ఓట్ల లెక్కింపు మొదలైంది. ఏపీలోని మెజారిటీ నియోజకవర్గాల్లో టీడీపీ లీడ్ లో ఉందని సమాచారం అందుతోంది. రాజమండ్రి రూరల్, గజపతి నగరం, నంద్యాల లోక్ సభ, పాణ్యం, నెల్లూరు సిటీలో కూటమికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఎన్నికల ట్రెండ్స్ చెబుతున్నాయి. మండపేటలో కూడా టీడీపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉండటం గమనార్హం.
 
ప్రతి నియోజకవర్గంలో భారీ ఆధిక్యంతో కూటమి అభ్యర్థులే పైచేయి సాధిస్తున్నారు. రాజమండ్రి లోక్ సభలో కూటమి అభ్యర్థి పురంధేశ్వరి కి అనుకూలంగా పరిస్థితులు ఉండటం గమనార్హం. కూటమికే ఫలితాలు ఫేవర్ గా ఉండటంతో బాబు చరిత్రను తిరగరాస్తారని 2019లో వైసీపీ క్రియేట్ చేసిన మ్యాజిక్ ను ఈ ఎన్నికల్లో కూటమి క్రియేట్ చేస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
ఫలితాలు తమకు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి. ఈ ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీతో కూటమికి అధికారం సొంతం కానుందని వినిపిస్తోంది. వైసీపీ కంచుకోట అయిన నంద్యాల లోక్ సభ, పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గంలో సైతం ఫలితాలకు సంబంధించి కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో నిలవడం గమనార్హం.
 
2024 ఎన్నికల్లో గెలుపు కోసం టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకోగా ఆ పొత్తుకు అనుకూల ఫలితాలే వస్తున్నాయని తెలుస్తోంది. అయితే ఈ ఓట్లు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మాత్రమే కావడంతో ముందుంది ముసళ్ల పండగ అని తమకే అనుకూలంగా ఫలితాలు ఉండవచ్చని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. ఉత్కంఠతో జరుగుతున్న ఈ ఎన్నికల పోరులో తుది ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చూడాలి. బాబు చరిత్ర తిరగరాస్తారేమో చూడాలి. ఏపీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి వైసీపీ కంచుకోటలైన చాలా నియోజకవర్గాల్లో ఫలితం పూర్తిస్థాయిలో మారిపోనుందని సమాచారం అందుతోంది.  చంద్రబాబు వేవ్ తో ఈ ఎన్నికలలో ఎవరూ ఊహించని సర్వేలకు సైతం అందని ఫలితాలు రానున్నాయని తెలుస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: