నాగపూర్: సినీ గ్లామర్ కి రంగులు.. ఆధిక్యంలో కంగనా రనౌత్..!

Divya
భారతదేశంలో రెండవ అతిపెద్ద నగరం మహారాష్ట్రలోని 48 సీట్లపై దృష్టి సారించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చారిత్రాత్మకంగా మూడవసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. నాగపూర్ లో కేంద్రమంత్రి నితిన్ ఘట్కారి 2014 మరియు 2019లో గణనీయమైన ఓట్లతో విజయం సాధించి మూడోసారి విజయం కోసం ప్రయత్నిస్తున్నారు.. నాగపూర్ మండి లో బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ బిజెపి తరఫున బరిలోకి దిగుతూ ఉండగా ఈమెకు పోటీగా కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య లోక్సభ స్థానం కోసం పోటీ పడుతున్నారు.. జూన్ 1 2024 న ఇక్కడ చివరిదశ ఎన్నికల పోలింగ్ జరిగింది.. 17 అసెంబ్లీ సెగ్మెంట్లతో కూడిన మండి సాంప్రదాయంగా కాంగ్రెస్ కంచుకోటగా ఉంది.. అయితే 2019 ఎన్నికల్లో బిజెపికి చెందిన రామ స్వరూప శర్మ 68.75% ఓట్లతో 43% పైగా భారీ తేడాతో సీట్లు గెలుచుకున్నారు.. ఇక ఈ మండీ లోక్సభ ఎన్నికలలో బహిరంగంగా మరియు వివాదాస్పద స్వభావానికి పేరుగాంచిన కంగనా రనౌత్ పోటీ చేస్తోంది..
ఇకపోతే సినిమాల నుంచి ఎన్నికలలో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఇక తను పోటీ చేస్తున్న నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించి పెద్ద సంఖ్యలో జనాలను ఆకర్షించింది.. ఈమెకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు ఇతర బిజెపి అగ్ర నేతల మద్దతు కూడా లభించింది.. అలాగే కాంగ్రెస్ నుంచి హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కుమారుడు విక్రమ్ ఆదిత్య సింగ్ తన కుటుంబ వారసత్వాన్ని కొనసాగించారు. ఇక అలా ఎట్టకేలకు విక్రమాదిత్య సింగ్ కాంగ్రెస్ తరపున పోటీ పడగా కంగనా రనౌత్ బీజేపీ తరఫున పోటీ పడింది..  ఇక తాజాగా ఓట్లు లెక్కింపులో ప్రస్తుతం కంగనా లీడింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది..ఇక ఇక్కడ ఎవరు గెలుపొందారు అనే విషయం తెలియాలి అంటే పూర్తి ఫలితాలు వెలువడే వరకు ఎదురు చూడాల్సిందే మొత్తానికైతే బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కంగనా రనౌత్ లీడింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: