విజయం: ఏపీలో ఫ‌స్ట్ రౌండ్స్ వచ్చేశాయ్‌... లీడ్‌లో ఉన్న హీరోలు వీళ్లే.. బాబు గారి మెజార్టీ ఇదే..!

RAMAKRISHNA S.S.
ఆంధ్రప్రదేశ్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల‌ లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. రాష్ట్రం మొత్తం మీద 3.33 కోట్ల ఓట్లు పోల్ అయ్యాయి. ఇక పోస్టల్ బ్యాలెట్ ఓట్ల‌ విషయానికి వస్తే మొత్తం 4.61 ల‌క్ష‌ల ఓట్లు పోల్ అయ్యాయి. ముందు నుంచి కూడా ప్రభుత్వ ఉద్యోగులు అందరూ అధికార వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు అన్న ప్రచారం గట్టిగా నడిచింది. వైసీపీ గెలుస్తుంద‌ని చెప్పిన స‌ర్వేలు సైతం పోస్ట‌ల్ బ్యాలెట్స్ ట్రెండ్స్ అన్నీ కూడా కూట‌మికే ఉంటాయ‌ని అంచ‌నా వేశారు. ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు మొదలవగానే ట్రెండ్ లో టీడీపీ రెండు చోట్ల ఆధిక్యంలో ఉన్న‌ట్టు తెలుస్తోంది.

రాజ‌మండ్రి రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బుచ్చ య్య చౌద‌రి ఏకంగా 900 + ఓట్ల ఆధిక్యంలో ఉన్న‌ట్టు తెలుస్తోంది. అలాగే నెల్లూరు సిటీ నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి నారాయ‌ణ సైతం ఆధిక్యంలో ఉన్నార‌ని తెలుస్తోంది. ఇక తెలంగాణ వ‌ర‌కు వ‌స్తే క‌రీంన‌గ‌ర్ లో బండి సంజ‌య్ బీజేపీ అభ్య‌ర్థి.. అటు ఆదిలాబాద్‌లో గెడం న‌గేష్ బీజేపీ నుంచి కూడా ఆధిక్యంలో ఉన్న‌ట్టు క్లీయ‌ర్ గా తెలుస్తోంది. ఇక దేశ‌వ్యాప్తంగా చూస్తే ఎన్డీయే కూట‌మి దూసుకు పోతోంది. బీజేపీ నుంచి పోటీ చేసిన అన్నామ‌ళై, నితిన్ గ‌డ్క‌రీ, హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్ తో పాటు ముంబై నుంచి ఫియూష్ గోయ‌ల్‌. రాహుల్ గాంధీ తాను పోటీ చేసిన వ‌య‌నాడ్ , రాయ్‌బ‌రేలీలో కూడా ముందంజ‌లో రాహుల్ గాంధీ ముందంజ‌లో ఉన్నారు. ఇక కుప్పంలో 1600 ఓట్ల ఆధిక్యంలో చంద్ర‌బాబు ఉన్నారు.

ఏపీ అసెంబ్లీ , పార్ల‌మెంట్ , తెలంగాణ పార్ల‌మెంట్ , ఇండియా పార్ల‌మెంట్ . . .  ఎన్నిక‌ల కౌంటింగ్ , లైవ్ అప్‌డేట్స్ , విశ్లేష‌ణాత్మ‌క , స‌మ‌గ్ర‌ క‌థ‌నాలు ఎప్ప‌టిక‌ప్పుడు అందించేందుకు indiaherald.com ఫాలో అవ్వండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: