రాజమండ్రి రూరల్ బుచ్చయ్య చౌదరి ఆదిక్యం..!

Divya
ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికల ఫలితాలు మొదలు అయ్యాయి.. ఇప్పటికే ఓట్ల లెక్కింపును కూడా మొదలుపెట్టారు అధికారులు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో 900 ఓట్లకు పైగా ముందంజలో రాజమండ్రి రూరల్ టిడిపి లీడ్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. రాజమండ్రి రూరల్ నుంచి బుచ్చయ్య చౌదరి పోటీ చేయగా... ప్రస్తుతం తాజాగా వెలువడుతున్న కౌంటింగ్ ఫలితాల ప్రకారం ఆయన మందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 175 స్థానాలలో ఒక స్థానంలో ఆల్రెడీ టిడిపి అభ్యర్థి గా పోటీ చేస్తున్న   గోరంట్ల బుచ్చయ్య చౌదరి..  తన సమీప అభ్యర్థి వైసిపి ఎమ్మెల్యేగా చెల్లబోయిన వేణుగోపాల్ కృష్ణ పోటీ చేయాగా ఈయనపై  5795  ఓట్లతో ఈవీఎం తొలి రౌండులో గోరంట్ల ఆదిక్యత సాధించారు.

ఇకపోతే 175 స్థానాలలో ఒక స్థానంలో ఇప్పుడు టిడిపి ఆధిక్యం లో ఉన్నట్టు తెలుస్తోంది.. ఇంకా ఫలితాలు వెలబడలేదు కాబట్టి  ప్రస్తుతం అయితే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదిక్యంలో ఉన్నట్లు సమాచారం. రాజమండ్రి రూరల్ చిన్నది కాబట్టి అక్కడ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు త్వరగా ముగిబోతోందని సమాచారం మరి కాసేపట్లో ఇక్కడ అధికారంలోకి ఎవరు రాబోతున్నారు అనే విషయం స్పష్టం అవుతుంది. తాజాగా అందుతున్న పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ వివరాల ప్రకారం చూసుకున్నట్లయితే.. ప్రస్తుతం కూటమి టిడిపి ఆధిక్యంలో ఉన్నట్లు వెల్లడిస్తుండగా మిగతా రౌండ్లో ఎవరు ఆధిక్యంలోకి వస్తారు అన్నది తెలియాల్సి ఉంది.
ఇక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత ఉత్కంఠ గా కొనసాగుతున్నాయి. ఈసారి ఎవరు గెలుస్తారనే కోణంలో ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తుండగా ఇప్పుడు ఒక్కొక్క సీటు ఫలితాలు వెలువడుతుండడంతో అటు ప్రజలలో ఇటు పోటీ చేసిన అభ్యర్థులలో కూడా టెన్షన్ తట్టుకోలేక చెమటలు పడుతున్నాయని చెప్పవచ్చు. మొత్తానికి అయితే టిడిపి ఆదిక్యంలో ఉండి ఖాతా ఓపెన్ చేసేసింది మరి పూర్తి వివరాలు వెలువడే వరకు ఎవరు గెలుపొందుతారు వేచి చూడాలి. మరి కాసేపట్లో ఈ రాజమండ్రి రూరల్ ఎవరి ఆధీనంలోకి వెళ్ళబోతుందో తెలియనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: