కౌంటింగ్‌కు ముందు ఊహించ‌ని షాక్‌లు... టీడీపీ ఇలా అనుకోలేదా..?

RAMAKRISHNA S.S.
రాష్ట్రంలో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఊహించ‌ని ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ప్ర‌ధా న ప్ర‌తిప‌క్షం విష‌యాన్ని తీసుకుంటే.. 2019లో విభేదించిన పార్టీలతోనే ఇప్పుడు జ‌త క‌ట్ట‌డం సంచ‌ల నం. 2014లో బీజేపీతో క‌లిసి ప్ర‌యాణించిన టీడీపీ జ‌న‌సేన‌తో క‌లిసి అడుగులు వేసింది. ఆ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పాల్గొన‌కపోయినా.. మ‌ద్ద‌తుగా నిలిచింది. ఇక‌, 2019కి వ‌చ్చే స‌రికి బీజేపీతోను... జ‌న‌సేన‌తోనూ.. కూడా టీడీపీ క‌టీఫ్ పెట్టుకుంది.

అయితే.. చిత్రంగా 2024 ఎన్నిక‌ల‌కు వ‌చ్చే స‌రికి మాత్రం అనూహ్య‌మైన మార్పులు చోటు చేసుకున్నా యి. దీనిలో రెండు ర‌కాలు మ‌న‌కు స్ప‌ష్టంగా క‌నిపిస్తాయి.  ఒక‌టి పొత్తులు. రెండు హామీలు. ఈ విష‌యం లో త‌మ‌ను తీవ్రంగా విమ‌ర్శించి.. త‌మ‌పై యుద్ధం ప్ర‌క‌టించింద‌ని పేర్కొన్న బీజేపీతో క‌లిసి అడుగులు వేయ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు.. బీజేపీ ముందు అనేక సంద‌ర్భాల్లో టీడీపీని వ్య‌తిరేకించింది. పొత్తుల‌కు కూడా.. ముందుకు రాలేదు.

అయినా.. కూడా చంద్ర‌బాబు వేచి చూసి.. రోజుల త‌ర‌బ‌డి ఢిల్లీలో మ‌కాం వేసి మ‌రీ.. పొత్తులు పెట్టుకు న్నారు. జ‌న‌సేన‌తోనూ.. క‌లిసి ముందుకు న‌డిచారు. ప్ర‌త్యేక ప్యాకేజీని తీసుకున్న‌ప్పుడు.. పాచిపోయిన ల‌డ్డూలంటూ.. ఎద్దేవా చేసిన ప‌వ‌న్‌, నారా లోకేష్ త‌ప్ప‌.. ఇంకెవ‌రూ.. పార్టీలో కీల‌క నేత‌గా ఎద‌గ‌లేద‌ని విమ‌ర్శించిన ప‌వ‌న్‌తోనే చంద్ర‌బాబు చేతులు క‌లిపారు. అదేస‌మ‌యంలో ప్ర‌ధాని న‌రంద్రమోడీని క‌లుపుకొని వెళ్లడంలో అనేక ఇబ్బందులు వ‌చ్చినా.. మైనారిటీ ఓటు బ్యాంకుకు గండం ప‌డుతుంద‌ని తెలిసినా.. కూడా బాబు వెనుక‌డుగు   వేయ‌కుండా ముందుకు న‌డిచారు.

మ‌రీ ముఖ్యంగా ఎన్నిక ల‌స‌మ‌యంలో ఉచితాల‌కు ప్రాధాన్యం ఇచ్చారు చంద్ర‌బాబు, జ‌గ‌న్ రూపాయి ఇస్తే.. తాను రూ.10 ఇస్తాన‌ని  చెప్పుకొచ్చారు. అంతేకాదు.. గ‌తానికి భిన్నంగా సూప‌ర్ సిక్స్ పేరుతో ఆర్టీసీ బ‌స్సుల్లో కీల‌క‌మైన ఉచిత ప్ర‌యాణం ప్ర‌క‌టించారు. అదేస‌మ‌యంలో జ‌గ‌న్ విధానాల‌ను ఎండ‌గ‌ట్టారు. ఎన్నారైల‌ను తీసుకువ‌చ్చారు. నంద‌మూరి, నారా కుటుంబాల‌ను రోడ్డెక్కించారు. చంద్ర‌బాబు స‌తీమ‌ణిని సైతం ఇంటింటికీ తిప్పారు. ఎప్పుడూ ఎండ‌క‌న్నెరుగ‌ని ఇల్లాలుగా ఉన్న భువ‌నేశ్వ‌రిని 9 వేల కిలో మీట‌ర్లు తిప్పారు. మొత్తంగా చూస్తే.. గ‌తంలో ఎప్పుడూ లేని విధంగా టీడీపీ చేసిన ఈ ప్ర‌చారం, ప్ర‌య‌త్నం ఏమేర‌కు ఫ‌లిస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: