కౌం ' ట్రిక్స్ ' : ఏజెంట్లతోనే ప్రధాన పార్టీల కుట్రలు.. ఈ తప్పులు చేస్తే కొంప కొల్లేరే!

Reddy P Rajasekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరికొన్ని గంటల్లో ఎన్నికల కౌంటింగ్ జరగనుందనే సంగతి తెలిసిందే. కూటమి, వైసీపీ మధ్య ప్రధానంగా పోటీ ఉన్న నేపథ్యంలో ప్రతి ఓటు కీలకంగా మారనుంది. టీడీపీ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు, వైసీపీ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని ఆ పార్టీ నేతలు సూచనలు చేయడం జరిగింది. పోస్టల్ బ్యాలెట్ ఫైట్ లో వైసీపీకి ఇప్పటికే వరుస షాకులు తగిలాయి.
 
వైసీపీ సుప్రీం కోర్టును పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కోసం ఆశ్రయించగా అక్కడ ఎలాంటి తీర్పు వస్తుందో చూడాల్సి ఉంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుకు సంబంధించి కూటమి నేతల తీరు ఒకలా ఉంటే వైసీపీ తీరు మరోలా ఉండటం ఏపీ ఓటర్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై కూటమి ఆశలు పెట్టుకున్న స్థాయిలో వైసీపీ మాత్రం ఆశలు పెట్టుకోలేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
గతంతో పోల్చి చూస్తే రాష్ట్రంలోని నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల సంఖ్య భారీగా పెరిగిందని సమాచారం అందుతోంది. కౌంటింగ్ కేంద్రాలలో తప్పు జరిగితే అస్సలు అంగీకరించవద్దని ప్రధాన పార్టీలు ఏజెంట్లకు ఇప్పటికే సూచించడం జరిగింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల నిబంధనలకు సంబంధించి ఏజెంట్లకు ఏ మాత్రం అవగాహన లేకపోయినా పార్టీలకు కొంప కొల్లేరే అని కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
కౌంటింగ్ కేంద్రాలలో ఏజెంట్లు ఎక్స్ట్రాలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు. ఆవాంతరాలు సృష్టిస్తే నిర్ధాక్షిణ్యంగా ఆ ఏజెంట్లను బయటకు పంపించడంతో పాటు చట్టపరంగా వాళ్లపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. పోలింగ్ ఏజెంట్లు నేర్పుతో వ్యవహరిస్తే మాత్రమే మోసాలు జరగకుండా జాగ్రత్త పడే ఛాన్స్ అయితే ఉంటుంది. అయితే ఏజెంట్లు గొడవ పడకుండా సమయస్పూర్తితో వ్యవహరించాల్సి ఉంటుంది. రూల్స్ పాటిస్తూ తప్పులను వేలెత్తి చూపిస్తే మాత్రం ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగే అవకాశాలు అయితే ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: