ఆరా మస్తాన్: బురద జల్లుతున్న టిడిపి నేతలు..!

Divya
ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ విషయంలో ఆరా మస్తాన్ వైసీపీ పార్టీకి గెలుస్తుందని చెప్పడంతో టిడిపి అధినేతలు కొంతమంది ఆయన పైన దుష్ప్రచారం చేస్తున్నారు.. ముఖ్యంగా ఆరా మస్తాన్ టిడిపి పార్టీ నుంచి టికెట్ అడిగారని అది ఇవ్వకపోవడం వల్లే ఇలా చేశారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఆరా మస్తాన్ తన భార్యకు చిలకలూరిపేట సీటు అడిగితే పత్తిపాటి పుల్లారావు ఉన్నారు కనుక.. అక్కడ కుదరదు అన్నారట. మైనార్టీలు ఎక్కువగా ఉన్నారని మస్తాన్ అడిగారని.. లేకపోతే గుంటూరు తూర్పు సీటు ఇవ్వమని అడిగారట.. అది కుదరదని చెప్పడం వల్లే ఈ సర్వే ఆరా మస్తాన్ చేశారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు.

అయితే ఇక్కడ గమనించదగ్గ విషయమేమిటంటే.. ఆరా మస్తాన్ అంత డబ్బులు పెట్టుకోగలడా.. ఆ లెక్కన అయితే వైసిపి పార్టీని అడిగినా కూడా ఎక్కడో ఒకచోట మైనార్టీ కోట కింద సీటు ఇచ్చేవారు.. ఆరా మస్తాన్ అలా చెప్పినందుకు జగన్ ఏమైనా సీటు ఇచ్చారా.. మరొక అంశం ఏమిటంటే కచ్చితంగా ఎంత లేదన్న కనీసం 15 నుంచి 20 కోట్ల రూపాయలన్నా ఖర్చు చేసుకోవాలి.. అంత డబ్బులు ఆరా మస్తాన్ దగ్గర ఉన్నాయా.. ముఖ్యంగా అతను ఒక సెఫాలజిస్ట్ గా మంచి పేరు సంపాదించారు దానిని చాలా నమ్మకంతోనే ముందుకు తీసుకువెళ్తున్నారు.

అయితే ఈసారి చెప్పిన ఎన్నికలలో ఒకవేళ ఫెయిల్ అవచేమో.. సీట్ ఇస్తేనే అనుకూలంగా చెప్పేవారేమో.. యాక్సిస్ మై ఇండియా వారు టిడిపి పార్టీ నుంచి సీటు ఇచ్చారా టిడిపికి అనుకూలంగా మాట్లాడుతున్నారు అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కేకే సర్వే వాళ్ళకి ఏమిచ్చారు అంటూ కూడా మరి కొంతమంది నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎవరు ఎవరి యొక్క ఆలోచన తీరుతోనే వారు చెబుతున్నారని తెలుస్తోంది. అయితే వీరు ఇందులో సక్సెస్ కావచ్చు ఫెయిల్యూర్ కావచ్చు. కానీ ఇలాంటి వారి మీద అవినీతి మాటలు మాట్లాడుతూ వారిని కించపరిచేలా చేస్తున్నారు. ఇది ముమ్మాటికి తప్పే అంటూ పలువురు నేతలు కూడా తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: