సిక్కిం లో మరొకసారి SKM పార్టీ విజయకేతం..!

Divya
దేశంలో నిన్నటి రోజున సార్వత్రిక ఎన్నికలు సైతం అన్నిచోట్ల ముగిశాయి. ఓటింగ్ ప్రక్రియ కూడా చాలాచోట్ల భారీగానే పోలైనట్లు తెలుస్తోంది. ఇప్పుడు మొత్తం జూన్ 4వ తేదీన వెలుపడే ఫలితాల కోసమే చాలా ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు ప్రజలు. ఏడో దశ ఎన్నికలు అయిపోయిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ కూడా విడుదల చేయడం జరిగింది. ఇదంతా ఇలా ఉండగా రెండు రాష్ట్రాలలో ఓట్ల లెక్కింపు రెండు రోజులు ముందుగానే మొదలైనట్లుగా తెలుస్తోంది.. ముఖ్యంగా అరుణాచల ప్రదేశ్ ,సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ గడువు ముగియడంతో కౌంటింగ్ ను కూడా ముందుగానే ప్రారంభించినట్లుగా తెలుస్తోంది ఎన్నికల సంఘం.

ఈరోజు ఉదయం ప్రారంభమైన కౌంటింగ్ లో రెండు రాష్ట్రాలలో కూడా చాలా ప్రశాంతంగానే కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ లో అధికార పార్టీ బిజెపి 27 సీట్లలో గెలుపొందింది 21 సీట్లలో ముందంజలో అధికారం దిశగా దూసుకుపోతున్నది. సిక్కిం లో మరొకసారి సిక్కిం క్రాంతి కార్ మోర్చా అధికారం దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ పార్టీ ఇప్పటివరకు 18 సీట్లను సైతం కైవసం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రేమ్ సింగ్ తమాంగ్ నేతృత్వంలో skm ఆదిత్యంలో దూసుకుపోతున్నట్లుగా తెలుస్తోంది.

ఆ రాష్ట్రంలో ఉన్న 32 స్థానాలలో అధికారం చేపట్టడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 17 అయితే ఇప్పటికే 17 సీట్లను ఎస్ఎంకె పార్టీ కైవసం చేసుకుంది .ఇక sdf పార్టీ ఇప్పటి వరకు కేవలం ఒక్క స్థానంలో మాత్రమే ఆధిపత్యం పుంజుకుంది. దీంతో సిక్కిం లో మరొకసారి skm పార్టీ విజయకేతం ఎగరేస్తుంది. తెలుగు రాష్ట్రాలలో అయితే ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ కూడా విడుదల చేసినప్పటికీ ఎవరు గెలుస్తారని విషయం పైన స్పష్టమైన క్లారిటీ ఇవ్వలేదు.. అయితే జూన్ 4వ తేదీ వరకు ఏపీ ప్రజలు వేచి చూడక తప్పడం లేదు. మరి ఆరోజు ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: