ఎగ్జిట్ పోల్స్ తప్పై ఉండొచ్చు.. పేర్ని నాని షాకింగ్ కామెంట్స్?

praveen
దేశవ్యాప్తంగా జరిగిన లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇటీవల వెలువడ్డాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీలో ఎవరికి మెజారిటీ దక్కుతుంది అనే విషయంపై తీవ్ర స్థాయిలో ఉత్కంఠ నెలకొనగా.. ఈ ఎగ్జిట్ పోల్స్ లో ఫలితాలు కూడా అటు ఏపీ ప్రజలందరినీ కూడా కన్ఫ్యూజన్లో పడేసాయి అని చెప్పాలి  ఎందుకంటే కొన్ని సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ సర్వేలలో అటు కూటమి అధికారంలోకి వస్తుంది అని అంచనా వేస్తే.. ఇంకొన్ని సర్వేలలో మాత్రం వైసిపి రెండోసారి అధికారాన్ని చేపడుతుంది అని చెప్పాయ్.

 కనీసం ఎగ్జిట్ పోల్స్ తర్వాత అయిన ఏపీలో అధికారం ఎవరిది అనే విషయంపై స్పష్టత వస్తుంది అనుకుంటే మళ్ళీ కన్ఫ్యూజన్లో పడిపోయారు జనాలు అని చెప్పాలి. అయితే ఆంధ్రప్రదేశ్లో అటు 25 లోక్సభ స్థానాలకు గాను, వైయస్సార్సీపీ 13 టీడీపీ కూటమి 12 సీట్లు గెలుస్తుందని సూచించిన ఎగ్జిట్ పోల్ అంచనాలపై స్పందించిన ఏపీ మంత్రి పేరుని నాని  కీలక వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిట్ పోల్స్ తప్పై ఉండవచ్చని తాము లోక్సభ ఎన్నికల్లో 20 కి పైగా స్థానాలను గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ ప్రకటించిన ఏజెన్సీలు తమ శాస్త్రీయ పద్ధతుల్లో లోపాల కారణంగా ఓటర్లను తప్పుగా లెక్కించి ఉండవచ్చు అంటూ పేర్ని నాని అన్నారు.

 25 స్థానాలకు గాను 20 స్థానాలలో తప్పకుండా విజయం సాధిస్తామని విశ్వాసం ఉందని.. ఎందుకంటే పోలింగ్ రోజున తమ సొంత ఎగ్జిట్ పోల్స్ నిర్వహించాము అంటూ పేర్ని నాని తెలిపారు. ఇక తమ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 20 లోక్సభ స్థానాల కంటే తక్కువ రాదు అంటూ ఆయన చెప్పుకొచ్చారు. అదే సమయంలో వైసీపీ, టీడీపీల మధ్య ఓట్ల శాతం పై గట్టి పోటీ ఉందన్న వాదన పై కూడా పేర్ని నాని స్పందించాడు. 2014లో వైఎస్ జగన్కు ఉన్న ఇమేజ్ తో పాటు 2019 నుంచి 2024 ఎన్నికల వరకు ప్రజల్లో ఉన్న ఇమేజ్ ని పూర్తిగా పరిశీలించాలి అంటూ సూచించారు. మునుపటితో పోల్చి చూస్తే తమకు ఓట్ల శాతం మరింత పెరుగుతుంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు పేర్ని నాని.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: