జగన్ వర్సెస్ పవన్.. అసెంబ్లీ సమావేశాలతో రియల్ హీరో ఎవరో తేలిపోనుందా?

Reddy P Rajasekhar
ఏపీలో ఎన్నికల ఫలితాలు వెలువడటానికి సమయం దగ్గర పడుతోంది. ఎగ్జిట్ పోల్స్ సైతం ఏపీలో ఏ పార్టీ గెలుస్తుందో కచ్చితంగా చెప్పలేకపోవడంతో ఈసారి ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఉత్కంఠ మామూలుగా ఉండదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మాత్రం భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ సర్వేలు వెల్లడించాయి. ఇకపై జరిగే అసెంబ్లీ సమావేశాలలో జగన్, పవన్ లను చూడబోతున్నాం.
 
జగన్, పవన్ ఒకరిపై ఒకరు ఎదురెదురుగా విమర్శలు చేసుకున్న సందర్భాలు అయితే లేవనే సంగతి తెలిసిందే. పవన్ గెలిస్తే మాత్రం ఈసారి అలాంటి పరిస్థితిని చూసే అవకాశం ఉంది. జగన్ వాగ్ధాటి గురించి అందరికీ తెలుసు. తన మాటలతో చంద్రబాబుకు ఎన్నోసార్లు జగన్ చుక్కలు చూపించారు. అయితే పవన్, జగన్ లలో అసెంబ్లీ సమావేశాలలో ఎవరు ఎవరికి చుక్కలు చూపిస్తారో చూడాల్సి ఉంది.
 
ఈ ఇద్దరిలో ప్రజల సమస్యల కోసం ఎవరు ప్రాధాన్యత ఇస్తారో రియల్ హీరో ఎవరో కూడా అసెంబ్లీ సమావేశాలతోనే తేలిపోనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జగన్, పవన్ లలో ఇద్దరినీ అభిమానించే అభిమానులు సైతం ఉన్నారు. అలాంటి వాళ్లకు ఇకాపై కొత్త కష్టాలు మొదలు కానున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో ఏ విధంగా బిహేవ్ చేస్తారో చూడాల్సి ఉంది.
 
పవన్ అనే నేను అంటూ పవన్ కళ్యాణ్ మరికొన్ని రోజుల్లో ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని తేలిపోయింది. పవన్ గెలిచి కూటమి అధికారంలోకి వస్తే పవన్ కు ఇచ్చే పదవి ఏంటనే చర్చ కూడా జరుగుతోంది. జనసేన నేతలకు ఎన్ని మంత్రి పదవులు దక్కుతాయనే చర్చ కూడా మొదలైంది. కేకే సర్వేలో జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించనుందని తేల్చి చెప్పడం గమనార్హం. అయితే ఆ సర్వే ఫలితాలు నిజమయ్యే ఛాన్స్ లేదని నెటిజన్లు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: