పిఠాపురం వార్ వన్‌సైడ్ అయిపోయిందా... వైసీపీ వాళ్లే ఒప్పేసుకున్నారుగా..?
ఈ విషయంలో రెండు సంస్థలు తమ అభిప్రాయాలు వెల్లడించాయి. ఆరా మస్తాన్ చేసిన సర్వేలో పిఠాపురంలో పవన్ విజయం దక్కించుకుంటున్నట్టు చెప్పారు. అంతేకాదు.. ఆయనకు ఇక్కడ 40 నుంచి 50 వేల ఓట్ల మెజారిటీ వస్తుందని చెప్పారు. ఇక, పిఠాపురంలో కాపుల ఓట్లు గుండుగుత్తగా ఆయనకే పడ్డాయని కూడా.. ఈ సర్వే వెల్లడించింది. ఇక్కడ ఒకటికి రెండు సార్లు సర్వే చేసినట్టు కూడా ఆరా మస్తాన్ వివరించారు. వంగా గీత నుంచి అనేక మంది నాయకుల వరకు ప్రతి విషయాన్నీ కూలంకుషంగా తెలుసుకున్నట్టు చెప్పారు. పవన్ గెలుపు పక్కా అని చెప్పారు.
ఇక, కేకే.. సర్వే వెల్లడించిన వివరాలు జనసేన నాయకులు, కార్యకర్తల్లో మరింత జోష్ నింపేశాయి. ఇక్కడ పోలింగ్ అంతా ఏకపక్షంగా జరిగిందని ఈ సర్వే వివరించింది. కనీ వినీ ఎరుగని రీతిలో ఇక్కడ పవన్ కల్యాణ్ విజయం దక్కించుకుంటున్నట్టు ఈ సర్వే పేర్కొంది. అయితే.. మెజారిటీ విషయంలో పక్కా వివరాలు వెల్లడించకపోయినా.. లక్ష మెజారిటీదాటి వస్తుందని చెప్పడం గమనార్హం. ఈ రెండు సర్వేలు ఇంత పక్కాగా చెప్పాయి. అయితే.. మరో సర్వే మాత్రం పవన్ గెలుస్తారని మాత్రమే చెప్పింది. ఓట్లు మాత్రం చెప్పలేదు. కొందరు వైసీపీ వాళ్లు కూడా పవన్ పిఠాపురంలో గెలుస్తాడంటున్నారు.
కాపుల ఓట్లు ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉన్నాయని.. వంగా గీతకూడా బలంగానే పోటీ ఇచ్చారని చెప్పింది. మొత్తంగా చూస్తే.. ఒక సర్వే మాత్రమే ఏకపక్షంగా ఇక్కడ ఓట్లు కురిసినట్టు తెలపడం గమనార్హం. మరోవైపు.. ఇక్కడ పోటీ బలంగానే ఉందని.. జన్‌మత్ సర్వే పేర్కొంది. ఇది విశ్వసనీయ సర్వే కావడం గమనార్హం. పోటీ బలంగా ఉందని.. గెలుపు ఎడ్జ్ మాత్రం .. ఇరు పక్షాలకూ ఉందని చెప్పడం విశేషం. ఎవరూ తక్కువ కాదని తేల్చి చెప్పింది. మొత్తంగా చూస్తే.. పిఠాపురంలో ఇంకా టెన్షన్ కొనసాగుతూనే ఉందని చెప్పాలి.