క‌డ‌ప‌లో ఓట్లు - సీట్లు త‌గ్గుతున్నాయా... వైసీపీ ఆరా

RAMAKRISHNA S.S.
ఎగ్జిట్ పోల్ అంచ‌నాలు వ‌చ్చిన త‌ర్వాత‌.. ఎక్కువ మంది దృష్టి పెట్టంది.. క‌డ‌ప పార్ల‌మెంటు సెగ్మెంట్‌పైనే.ఎందుకంటే.. ఇక్క‌డ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ష‌ర్మిల‌.. దివంగ‌త మంత్రి వివేకానంద‌రెడ్డి కుమార్తె సునీత‌లు జోరుగా ప్ర‌చారం చేశారు. అంతేకాదు.. ష‌ర్మిల మూడుసార్లు క‌న్నీరుపెట్టుకుని నాలుగు సార్లు ఇక్క‌డి ఓట‌ర్ల‌ను కొంగ  చాపి మ‌రీ ఓట్లు అర్థించారు. దీంతో ఆమె గెలుపు ఖాయ‌మేనా? అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప‌రిస్థితి ఎలా ఉన్నా.. వైఎస్ కుమార్తెగా.. ఆయ‌న వార‌సురాలిగా ప్ర‌క‌టించుకున్న ష‌ర్మిల ఓ రేంజ్‌లో ఇక్క‌డ ప్ర‌చారం చేశారు.

ఇది ఏమేర‌కు ఫ‌లించింద‌నేది ప్ర‌శ్న‌. అయితే.. తాజాగా ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాల్లో ఎవ‌రూ కూడా.. ష‌ర్మిల గెలుస్తుంద‌ని చెప్పక పోవ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు.. కాంగ్రెస్ పార్టీ కూడా.. ఎక్క‌డా విజ‌యం ద‌క్కించుకునే ప‌రిస్థ‌తి కూడా లేద‌న్నారు. అయితే.. ఓటు బ్యాంకు గ‌తంలో ఉన్న 1 శాతం నుంచి ఇప్పుడు రెండు లేదా మూడు శాతానికి మాత్ర‌మే చేరుతుంద‌ని వెల్ల‌డించాయి. ఇక‌, ఈ ప్ర‌భావం వైసీపీపై ఎక్కువ‌గా ఉంటుంద‌ని  స‌ర్వే సంస్థ‌లు తేల్చి చెప్పాయి. క‌డ‌ప‌లో ష‌ర్మిల ప్ర‌భావాన్ని ఈ కోణంలోనే చూసిన‌ట్టు సంస్థ‌లు వెల్ల‌డించాయి.

క‌డ‌పలో ష‌ర్మిల ప్ర‌భావంతో వైసీపీ ఓటు బ్యాంకు చీలుతుంద‌ని.. ఆమె డిపాజిట్ ద‌క్కించుకునే అవ‌కాశం ఉంటుంద‌ని ఆరా మ‌స్తాన్ స‌ర్వే వెల్ల‌డించింది. మిగిలిన సంస్థ‌లు కూడా దాదాపు ఇదే అంచ‌నా వెల్ల‌డించాయి. ఆమె గెలుపు క‌న్నా కూడా.. ఆమె ప్ర‌భావం వైసీపీపై ప‌డింద‌నే వాద‌న‌ను వెల్ల‌డించాయి. రాజంపేట‌, క‌డ‌ప‌లోని ప‌లు అసెంబ్లీ సెగ్మెంట్ల‌లో కూట‌మి విజ‌యానికి ష‌ర్మిల కార‌ణంగా మారుతున‌నార‌ని ఎగ్జిట్ పోల్స్ అంచ‌నాలు తేల్చి చెప్పాయి. ష‌ర్మిల చేసిన ప్ర‌చారంతో వ్య‌క్తిగ‌తంగా ఆమెకు ల‌బ్ధి చేకూర‌లేద‌నే విష‌యం ఎగ్జిట్ పోల్స్‌ తేల్చి చెప్పాయ‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది.

అయితే.. ఈ ప‌రిణామం వైసీపీకి ఇబ్బందిగా మార‌నుంది. ఎందుకంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు కూడా.క‌డ‌ప‌లోని ప‌ది స్థానాలు.. ఒక పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం కూడా.. త‌మ ఖాతాలోనే ప‌డుతుంద‌ని ఈ పార్టీ లెక్క‌లు వేసుకుంది. అస‌లు ష‌ర్మిల ప్ర‌భావంపైనా పెద్ద‌గా అంచ‌నాలు పెట్టుకోలేదు. కానీ, ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ గెలుస్తుంద‌ని చెప్ప‌క‌పోయినా.. ష‌ర్మిల ప్ర‌భావం క‌డ‌ప‌పై ఎక్కువ‌గా ఉంటుంద‌ని తేల్చి చెప్ప‌డంతో కీల‌క‌మైన  ఓటు బ్యాంకు అయితే.. వైసీపీకి దూర‌మ‌య్యే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంద‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: