ఏపీలో కూటమికి 4 ఎమ్మెల్యే స్థానాలే అంటున్న ప్రముఖ సర్వే.. నిజమైతే వైసీపీకి పండగే!

Reddy P Rajasekhar
ఆంధ్రప్రదేశ్ ఎగ్జిట్ పోల్స్ సర్వేల ఫలితాలు చిత్రవిచిత్రంగా ఉన్నాయి. ఏపీలో మళ్లీ ఫ్యాన్ ప్రభంజనమే అని ప్రముఖ సంస్థల సర్వే లెక్కలు చెబుతున్నాయి. వ్రాప్ స్ట్రాటజీస్ సర్వే సంస్థ ఏపీలో 2019 ఎన్నికల ఫలితాలను మించిన ఫలితాలతో వైసీపీ అధికారంలోకి రానుందని చెబుతోంది. రాష్ట్రంలో ఏకంగా 158 స్థానాల్లో ఫ్యాన్ గిరగిరా తిరుగుతుందని ఈ సర్వే పేర్కొంది. కూటమికి కేవలం 4 స్థానాలు వస్తాయని ఈ సర్వే చెబుతోంది.
 
రాష్ట్రంలో 13 స్థానాల్లో మాత్రం హోరాహోరీ పోటీ ఉండబోతుందని ఈ సర్వే లెక్కల ద్వారా వెల్లడవుతోంది. మిగతా సర్వేల ఫలితాలతో పోల్చి చూస్తే ఈ సంస్థ సర్వే ఫలితాలు మాత్రం వాస్తవాలకు విరుద్ధంగా వైసీపీ నేతలు సైతం నమ్మలేని విధంగా ఉన్నాయి. ఒకవేళ ఈ సంస్థ సర్వే ఫలితాలు నిజమైతే మాత్రం వైసీపీకి పండగేనని చెప్పవచ్చు. ఏపీలో కూటమికి 4 స్థానాలు వస్తే అంతకు మించి పరువు పోయే పరిస్థితి ఉండదు.
 
వ్రాప్ స్ట్రాటజీస్ సంస్థ సర్వే ఫలితాలు కూటమి నేతలు చెమటలు పట్టిస్తున్నాయి. ఈ సంస్థ సర్వే ఎక్కడ చేసిందో తెలీదు కానీ ఫలితాలు కూటమి నేతలకు గుబులు పుట్టించేలా ఉన్నాయి. ఈ సర్వే ఫలితాలు నిజమవుతాయో లేదో మరో రెండు రోజుల్లో తేలిపోనుంది. జూన్ 4వ తేదీ రాత్రి సమయానికి ఏపీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి క్లియర్ క్లారిటీ రానుంది. ఫలితాల విషయంలో ఏ పార్టీ నేతల కాన్ఫిడెన్స్ నిజం కానుందో తెలియాల్సి ఉంది.
 
ఈ సంస్థ ఫలితాలు నిజమైతే మాత్రం ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత ఈ సంస్థ పేరు మారుమ్రోగుతుందని చెప్పవచ్చు. ఏపీలో కూటమి తరపున 70 నుంచి 80 మంది ప్రముఖ నేతలు పోటీ చేస్తున్నారు. ఈ సంస్థ లెక్కల ప్రకారం దాదాపుగా 90 స్థానాల్లో కూటమి నేతలకు షాక్ తప్పదు. ఏపీలో కూటమికి మరోసారి దిమ్మతిరిగే ఫలితాలు వస్తే టీడీపీ, జనసేన ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: