బెంగాల్లో దీదీకి చావుదెబ్బ‌... క‌మ‌లం ఎంత గ‌ట్టిగా కొట్టిందంటే..?

praveen
దేశ ప్రజానీకం మొత్తం ఎంత ఉత్కంఠగా ఎదురుచూసిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రానే వచ్చాయి. ఈ క్రమంలోనే ఆయా రాష్ట్రాలలో ఎవరు విజయం సాధిస్తారు అనే విషయంపై తీవ్ర స్థాయిలో ఉత్కంఠమైన నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలలో ఇక మెజారిటీ ఎవరిది అనే విషయంపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని దేశ ప్రజానీకం మొత్తం నమ్మింది. ఈ క్రమంలోనే దేశంలో 400 సీట్లలో విజయం సాధిస్తామని నినాదంతో పార్లమెంట్ ఎన్నికల్లో బలిలోకి దిగిన బిజెపి ఇక మూడోసారి కేంద్రంలో హ్యాట్రిక్ కొట్టబోతుంది అనే విషయాన్ని ఎన్నో ఎగ్జిట్ పోల్స్ సర్వేలు చెప్పాయి.

 అదే సమయంలో అటు కొన్ని రాష్ట్రాలలో మాత్రం అటు ఎగ్జిట్ పోల్స్ సర్వేల అంచనాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి అని చెప్పాలి. మరి ముఖ్యంగా పశ్చిమబెంగాల్ కు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అయితే అందరిని అవాక్కాయ్యేలా చేశాయి. బిజెపి, తృణమూల్ కాంగ్రెస్ మధ్య పొలిటికల్ గా ఎంత శత్రుత్వం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా ఆ రాష్ట్రంలో పోలింగ్ జరుగుతున్న సమయంలోనే బిజెపి, టీఎంసీ కార్యకర్తలు మధ్య ఎన్నో గొడవలు జరిగాయి. కేంద్రం పశ్చిమ బెంగాల్ విషయంలో వివక్ష చూపుతుందని.. ఇవ్వాల్సిన నిధులు ఇవ్వడం లేదని సీఎం మమతా బెనర్జీ విమర్శిస్తే.. బిజెపి తాము ఇవ్వాల్సింది ఇచ్చేసాము అని లెక్కలు కూడా చూపించింది.

 ఇలా విమర్శలు ప్రతి సమస్యలు కొనసాగుతున్న సమయంలోనే లోక్సభ ఎన్నికలు జరిగాయి. అయితే ఇక ఈ లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ వస్తుంది అనే విషయంపై ఏబీపీ సి ఓటర్ ఎగ్జిట్ పోల్ 2024 షాకింగ్ అంచనా వేసింది  ఏకంగా పశ్చిమ బెంగాల్లో బిజెపిదే పై చేయి అని తెలిపింది. అక్కడ 28 ఎంపీ స్థానాలు ఉండగా ఎన్డీఏ కూటమి 23 నుంచి 27 స్థానాలు గెలుచుకుంటుందని.. ఇతర పార్టీలు 13 నుంచి 15 స్థానాలు గెలుచుకుంటాయని ఈ సర్వే రిపోర్ట్ చెబుతుంది  అయితే ఇండియా కూటమి మాత్రం ఒక్కటి నుంచి మూడు స్థానంలోకి పరిమితం కానుందట. ఓటు శాతం పరంగా చూసిన కూడా ఇండియా కూటమికి 13.2% మాత్రమే ఓట్లు పోలయ్యాయని.. ఏబిపి సి ఓటర్ ఎగ్జిట్ పోల్ సర్వే రిపోర్ట్ చెబుతుంది  అయితే ఎన్డీఏ కూటమికి 42.5 శాతం కు పైగా ఓట్లు పోల్ నమోదు అయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. త్రుణమూల్ కాంగ్రెస్ పార్టీకి 41.5% ఓట్లు పోలయ్యాయి అని తెలిపింది  అయితే పోలింగ్ శాతం పరంగా అటు బిజెపి, టీఎంసీ మధ్య తేడా లేకపోయినా సీట్ల పరంగా చూస్తే మాత్రం త్రుణమూల్ కాంగ్రెస్ బాగా వెనకబడిపోయినట్లు ఈ రిపోర్ట్ అంచనా వేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: