ఏపీ ఎగ్జిట్ పోల్ 2024 : ఆత్మ సాక్షి.. ఆ పార్టీదే అధికారం..?

Divya
ఆంధ్రప్రదేశ్లో మే 13వ తేదీన ఎన్నికలు పూర్తయిన విషయం తెలిసిందే.. జూన్ 4 వ తేదీన ఎన్నికల ఫలితాలు తెలియనున్నాయి .. కానీ అంతలోపే ఆంధ్రప్రదేశ్లో హై టెన్షన్ నెలకొంది.. అటు కూటమి.. ఇటు అధికార పార్టీ వైసిపి .. ఎవరు గెలవబోతున్నారు అనే ఉత్కంఠత అటు పార్టీ నేతల్లోనే కాదు ఇటు ప్రజలలో కూడా మరింత ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలోనే తాజాగా ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి.. తాజాగా ఏపీ ఎగ్జిట్ పోల్ 2024 కి సంబంధించి ఆత్మసాక్షి సర్వే ఎగ్జిట్ పోల్ లో ప్రజల తీర్మానం ఎవరి వైపు ఉంది అనే విషయంపై క్లారిటీ ఇచ్చింది.. ఎవరికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అనే విషయంపై కూడా స్పష్టం చేసింది..
తాజాగా ఆత్మ సాక్షి సర్వే ప్రకారం అధికార పార్టీ వైఎస్ఆర్ పార్టీకి 98-116 సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పిన ఆత్మసాక్షి సర్వే.. మరోవైపు కూటమిగా ఏర్పడిన టిడిపి జనసేన బిజెపి పార్టీలకు కలిపి 59-77 సీట్లు వచ్చే అవకాశం ఉందని తేల్చేసింది.. తాజాగా ఆత్మసాక్షి పంచుకున్న ఈ ఎగ్జిట్ పోల్ రిజల్ట్ చూసి వైసిపి అధికారులు, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.. దాదాపు గతంలో కూడా ఆత్మసాక్షి షేర్ చేసిన ఎగ్జిట్ పోల్స్ .. రిజల్ట్ కి దరిదాపుల్లోనే వచ్చాయి.. ఈ నేపథ్యంలోనే ఆత్మసాక్షి చేసిన సర్వేలో వైసీపీ పార్టీ ప్రభంజనం సృష్టించబోతుందని మళ్లీ అధికారంలోకి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారని స్పష్టం చేసింది.

మొత్తానికైతే గత అరగంట క్రితం వరకు ప్రజలలో ఉత్కంఠ నెలకొనగా ఈ హై టెన్షన్ కి తెర దించుతూ ఆత్మసాక్షి షేర్ చేసిన ఈ ఎగ్జిట్ పోల్ రిజల్ట్ కాస్త ఊరట ఇచ్చిందని చెప్పాలి..మరొకవైపు కూటమి లో ఈ విషయాలు మరింత దిగ్బ్రాంతికి గురి చేస్తున్నాయని చెప్పవచ్చు. మొత్తానికైతే ఆత్మసాక్షి మరొకసారి వైసిపి అధికారంలోకి రాబోతోందని ఫ్యాన్ దే ఈసారి కూడా హవా అని స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: