ఎగ్జిట్ పోల్ 2024: అందరి చూపు ఆ నియోజకవర్గం వైపే..!

Divya
ప్రస్తుతం అందరి దృష్టి ఎగ్జిట్ పోల్ వైపే.. నిజానికి ఎన్నికల్లో పోలింగ్ వరకు ఒక ఎత్తైతే.. కౌంటింగ్ ఒక్కటే ఒక ఎత్తు అని చెప్పాలి.. తాము పడిన కష్టం ఫలించిందా లేదా అన్నది తేలేది ఫలితాల రోజు మాత్రమే.. దీనికోసం కళ్ళల్లో ఒత్తులేసుకుని మరీ అటు పార్టీలు , ఇటు కార్యకర్తలు సాధారణ ప్రజలకు కూడా నిరీక్షిస్తూ ఉంటారు.. అందుకే ఎన్నికలు ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఇస్తూ ఉంటారు.. ఈ నేపథ్యంలోనే మరో అరగంటలో ఎగ్జిట్ పోల్ లెక్కలు వస్తాయి.. ఫలితాల కోసం ఎంత ఉత్కంఠ గా ప్రజలు ఎదురుచూస్తున్నారో అంతే ఆసక్తి రేపుతోంది. ఎగ్జిట్ పోల్ వీటి ఆధారంగానే ఎవరు గెలుస్తారు అని అందరూ ఒక నిర్ణయానికి వచ్చేస్తారు..
సర్వే ఎలా ఉన్నా సరే ఓటు వేసి వచ్చిన తర్వాత ఇచ్చే ఫీడ్బ్యాక్ ఒక్కటే కీలకమని అందరూ భావిస్తూ ఉంటారు. అయితే ఒక్కోసారి ఎగ్జిట్ పోల్ లెక్కలు తారు మారు అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.. అయినా సరే ఈ ఎగ్జిట్ పోల్ కి  ఉన్న క్రేజ్ మాత్రం తగ్గలేదని చెప్పాలి. ఇదిలా ఉండగా కాసేపట్లో ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడనున్న నేపద్యంలో ప్రస్తుతం అందరి దృష్టి ఆ నియోజకవర్గం పైనే ఉంది. మొదట ఆ నియోజకవర్గం లోనే ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడనున్నాయి.

ప్రస్తుతం మరి కాసేపట్లో ఆరా సర్వే ఎగ్జిట్ పోల్ విడుదల కానుండగా ప్రస్తుతం పల్నాడు జిల్లా వైపే అందరూ మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే మద్దిరాల గ్రామానికి చేరుకున్న ఆరా మస్తాన్ కాసేపట్లో ప్రారంభం కానున్న ప్రెస్మీట్లో పాల్గొనబోతున్నారు. ప్రస్తుతం అందరీ చూపు పల్నాడు జిల్లా వైపే ఉంది.. మరి కాసేపట్లో ఇక్కడి నుంచే ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువబడునున్నాయి.. ఇక ఎవరి రాత ఎలా ఉందో తేల్చబోతోంది ఈ ఆరా సర్వే.. మరి ఏ పార్టీ ఎన్ని సీట్లతో అధికారంలోకి వస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: