స‌ర్వేల హ‌వా.. జ‌గ‌న్ Vs చంద్ర‌బాబు... ఎవ‌రి లెక్క ఏంటంటే..?

RAMAKRISHNA S.S.
ఈ నెల 13న జ‌రిగిన అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై వైసీపీ, టీడీపీ కూట‌మి జోష్‌గానే ఉన్నా యి. ఎవ‌రికి వారు ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. దీనికి కార‌ణం.. ఎవ‌రికి వారు స‌ర్వేలు చేయించుకోవ‌డ‌మే. ఎన్నిక‌ల‌కు ముందు - త‌ర్వాత కూడా.. ఇరు పార్టీల అధినేతలు స‌ర్వే చేయించుకున్నారు. అధికార వైసీపీ మూడు స‌ర్వేలు చేయించిన‌ట్టు తెలిసింది. ఈ మూడు సర్వే నివేదికలను జగన్ తెప్పించుకు న్నట్లు సమాచారం. ఈ మూడు స‌ర్వే ల నివేదిక‌లు చూశాక జ‌గ‌న్ లో ఫుల్ కాన్పిడెన్స్ వ‌చ్చేసిందంటున్నారు.

మరోవైపు సొంత మీడియా సంస్థ ద్వారా సర్వే చేసినట్లు కూడా తెలుస్తోంది. పోలింగ్ అనంతరం.. కేంద్రా ల నుంచి తెప్పించుకున్న సమాచారం మేరకు గెలుపు పై ఒక ధీమాకు వచ్చినట్లు స‌మాచారం. ప్రధానం గా ఓటింగ్ పెరగడం, మహిళా ఓటర్లు ఆసక్తి చూపడం, వృద్ధులు సైతం ఓటింగ్ లో పాల్గొనడం తమకు కలిసి వస్తుందని సీఎం జ‌గ‌న్ స‌హా వైసీపీ ప్రాథమిక అంచనాకు వచ్చింది. ఆ వివరాలన్నీ క్రోడీకరించిన తరువాతే సీఎం జగన్ ప్ర‌శాంతంగా ఉన్నార‌ని అంటున్నారు.

మరోవైపు ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందని.. చివరి మూడు రోజుల్లో పరిస్థితి మారిందని టిడిపి కూటమి అంచనా వేస్తోంది. ఎన్నికల నిర్వహణలో ఈసీ సంపూర్ణ సహకారం అందించడం, వైసిపి నిట్టూర్పు మాటలే తమ గెలుపునకు సంకేతాలని టిడిపి కూటమి నేతలు చెబుతున్నారు. అయితే గెలుస్తామని చెబుతున్న టిడిపి కూటమి నేతలు.. మెజారిటీ సీట్లు ఎంత వస్తాయి అన్నది చెప్పడం లేదు.

అయితే ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సీట్లు అధిగమిస్తామని.. 110 వరకు సీట్లను సొంతం చేసుకుంటామని మాత్రం చెబుతున్నారు. సోషల్ మీడియాలో మాత్రం ఎవరికి వారు గెలుస్తామన్న ధీమా మాటలతో గడుపుతున్నారు. కానీ, రెండు ఎగ్జిట్ పోల్స్ సంస్థలు ఏపీలో వార్ వన్ సైడేనని నివేదికలు ఇచ్చినట్లు సమాచారం. జూన్ 4న టిడిపి కూటమి మంచి విజయం సాధిస్తుందని.. ఎగ్జిట్ పోల్స్ నమ్ముకొని ఆందోళన చెందవద్దని.. ఎటువంటి బెట్టింగులు కట్టవద్దని టిడిపి నాయకత్వం అంతర్గతంగా శ్రేణులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: