ఏపీ: ఓట్ల బదిలీపై కూటమి టెన్షన్.. తలలు పట్టుకుంటున్న నేతలు..!

Divya
ఎన్నికల పోలింగ్ జరిగి ఇప్పటికీ  18 రోజుల పైన కావస్తున్నప్పటికీ.. జూన్ 4 వ తేదీన ఓటింగ్ రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి.. ఓటింగ్ ఫలితాలు దగ్గర పడుతున్న కొద్ది కూటమి అభ్యర్థులను టెన్షన్ మాత్రం పీక్ స్తాయిలో ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే పోలింగ్ తర్వాత కొన్ని కొత్త సందేహాలు కూడా మొదలవుతున్నాయి.. జనసేనకు 21 అసెంబ్లీ బిజెపికి 10 అసెంబ్లీ స్థానాలు ఇవ్వగ టిడిపి పార్టీ 144 స్థానాలలో పోటీ చేశారు. తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్న విషయం ఏమిటంటే..

కూటమి గెలిస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఉపయోగం భావించినప్పటికీ కాపు నియోజకవర్గాలనుంచి ప్రజలు మాత్రం ఎక్కువ శాతం కాస్త జగన్కు వ్యతిరేకంగానే ఓటు వేసినట్లు విశ్లేషకులు తెలియజేస్తున్నారు.. అయితే కొన్ని అసెంబ్లీలో టిడిపి నుంచి కాపు సామాజిక వర్గానికి చెందినవారు లేకపోవడం వల్ల అక్కడ ఓట్లు ట్రాన్స్ఫర్ కాలేదని తెలియజేస్తున్నారు. మరికొన్నిచోట్ల కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు నియోజవర్గంలో మరికొన్నిచోట్ల కాపు సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి ఉండడంతో వైసీపీకి ఓటు వేసినట్లు కథనాలు వినిపిస్తున్నాయి.

2014, 2019 ఎన్నికలలో వేరు 2024 ఎన్నికలు వేరు అన్నట్టుగా తెలుస్తోంది. 2014లో టిడిపి జనసేన బిజెపి ముగ్గురు కలిసి పోటీ చేశారు. అదే కాంబో వచ్చినందుకు ఈసారి విజయం ఖాయమని భావిస్తూ ఉంటే అదొక పిచ్చి ఆలోచన అని చెప్పవచ్చు.. అప్పుడు పరిస్థితులు వేరు 2019 ఎన్నికలు జరిగినప్పటి నుంచి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి ముఖ్యంగా గతంలో కంటే ప్రస్తుతం సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలలోకి వెళ్లడం వాలంటరీ వ్యవస్థ నాడు నేడుతో పూర్తిగా మారిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా ఈ ఎన్నికలు క్యాస్ట్ కంటే క్యాష్ అని సంక్షేమ పథకాలు ఎక్కువగా ప్రలోభాలు చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు తాము ఇచ్చిన హామీలకు ప్రజలు ఆశపడి ఓటు వేశారా లేకపోతే జగన్ సంక్షేమ పథకాలను మిర్చి ఏకపక్షం చేశారా అనే విషయం తెలియాల్సి ఉంది. అయితే ఇలాంటివన్నీ అటుకూటమినేతలను సైతం చాలా భయభ్రాంతులకు గురి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఓటింగ్ లెక్కింపు దగ్గర పడుతున్న కొద్దీ చాలామంది నేతలు తలలు కొట్టుకుంటున్నట్లుగా  చాలామంది నేతలు తలలు కొట్టుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: