కర్మ ఎవ్వరినీ వదిలిపెట్టదు.. ఏబీ వెంకటేశ్వరరావు జీవితానికి మించి సాక్ష్యం కావాలా?
కర్మ ఎవ్వరినీ వదిలిపెట్టదని అందుకే ఏబీవీ చాలాసార్లు సస్పెండ్ కావడం ద్వారా వార్తల్లో నిలిచారని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రింటింగ్, స్టేషనరీ అండ్ స్టోర్స్ పర్చేజ్ కమిషనర్ గా ఆయనను నియమించడం గమనార్హం. ఈరోజు సాయంత్రం ఆయన రిటైర్ కానున్నారని తెలుస్తోంది. గతంలో కూడా ఏబీవీకి ఈ పదవిలో పని చేసిన అనుభవం ఉంది.
ఈరోజు సీఎస్ జవహర్ రెడ్డి ఏబీవీకి పోస్టింగ్ ఇవ్వకపోయి ఉంటే ఆయన ప్రభుత్వం నుంచి వచ్చే ఎన్నో బెనిఫిట్స్ ను కోల్పోయేవారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బాబు హయాంలో నిఘా విభాగం అధికారిగా విధులు నిర్వహించిన ఏబీవీ చివరకు ఏ మాత్రం ప్రాధాన్యత లేని శాఖలో ఈ ఏడాదిలో ఒకే ఒక్కరోజు విధులు నిర్వహించి రిటైర్ కానున్నారు. వైసీపీ తలచుకుని ఉంటే ఈరోజు కూడా పోస్టింగ్ ఇవ్వకుండా కక్ష సాధింపు చర్యలకు దిగి ఉండేది.
వైసీపీ, ఏపీ సీఎస్ ఏబీవీపై జాలితో పోస్టింగ్ ఇవ్వడం జరిగిందని అంతకు మించి సంబరాలు చేసుకోవాల్సిన అవసరం లేదని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. డైరెక్టర్ జనరల్ ర్యాంక్ కలిగిన ఏబీవీ సస్పెన్షన్ల మీద సస్పెన్షన్లతో ఎంతో నష్టపోయారు. ఏబీవీకి పోస్టింగ్ ఇచ్చినందుకు టీడీపీ సంబరాలు చేసుకుంటే వాళ్లను మించిన అల్ప సంతోషులు ఎవరూ ఉండరని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అధికారులు పార్టీలకు అనుగుణంగా వ్యవహరిస్తే ఫలితం ఎలా ఉంటుందో చెప్పడానికి ఈయన జీవితమే సాక్ష్యమని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. ఏబీవీ జీవితం మరో విధంగా అధికారులకు స్పూర్తిగా నిలుస్తుందని చెప్పవచ్చు.