జ‌న‌సేన గెల‌వ‌క‌పోతే.. ప‌వ‌న్ ఇక ఆ ప‌ని చేసుకోవ‌డ‌మేనా..?

RAMAKRISHNA S.S.
ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో కూట‌మి పార్టీగా ఉన్న జ‌న‌సేన  తాజా ఫ‌లితంలో త‌ల‌కిందులు అవుతుందా?  లేక‌.. తా ము తెచ్చుకున్న 21 స్థానాల్లో క‌నీసం 10-15 చోట్ల అయినా.. గెలుస్తుందా? అనేది ఆస‌క్తిగా మారింది. గ‌త 2019 ఎన్నిక‌ల్లో మొత్తం 148 స్థానాల్లో పోటీ చేసిన జ‌న‌సేన కేవ‌లం ఒకే ఒక్క స్థానంరాజోలులో విజ‌యం ద‌క్కించుకుంది. పార్టీ అధినేత ప‌వ‌న్ కూడా రెండు చోట్ల పోటీ చేసినా.. ఓడిపోయారు. దీంతో గ‌డిచిన ఐదేళ్ల‌లో పార్టీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంది. అభిమాన బ‌లం ఉన్నా.. పార్టీని న‌డిపించే కార్య‌క‌ర్త‌ల బ‌లం కొర‌వ‌డింది.

పైగా అసెంబ్లీలోనూ.. జ‌న‌సేన మాట వినిపించే నాయ‌కుడు.. లేక పోవ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో కేవ లం పార్టీ నామ‌మాత్రంగానే మిగిలిపోయింది. అప్పుడ‌ప్పుడు.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ రావ‌డం.. ప్ర‌సంగా లు చేయ‌డం వ‌ర‌కే ప‌రిమితం అయ్యారు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు జ‌న‌సేన‌కు విజ‌యం అవ‌స‌రం. క‌నీసం పోటీ చేసిన 21 స్థానాల్లో 10 చోట్ల యినా.. గెల‌వ‌క‌పోతే. పార్టీ అస్థిత్వానికే ప్ర‌మాదం ఏర్ప‌డే అవ‌కాశం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

అంతేకాదు.. ఇప్ప‌టి వ‌ర‌కు రిజిస్ట‌ర్డ్ పార్టీగా ఉన్న జ‌న‌సేన‌కు గుర్తింపు కావాల‌న్నా.. ప‌ర్మినెంట్ గుర్తుగా గాజు గ్లాసు నిల‌వాల‌న్నా.. కూడా ఈ ఎన్నిక‌లు చాలా ప్ర‌ధానం. క్షేత్ర‌స్థాయిలో పార్టీ పుంజుకునేందుకు పార్టీ నిల‌దొక్కుకునేందుకు.. అసెంబ్లీలో బ‌ల‌మైన గ‌ళం వినిపించేందుకు కూడా.. ఈ ఎన్నిక‌లు చాలా కీల‌కంగా మారాయి. మ‌రీ ముఖ్యంగా ప‌వ‌న్ ఇమేజ్ అంటే.. కేవ‌లం సినిమాల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మ‌ని.. ఆయ‌న నిర్వ‌హించే స‌భ‌ల‌కు వ‌స్తున్న‌వారు.. ఓటుబ్యాంకుగా మార‌డం లేద‌న్న విమ‌ర్శ‌ల‌కు  చెక్ పెట్టాలంటే కూడా.. ప్ర‌స్తుత ఎన్నిక‌లు కీల‌కం.

అందుకే.. జ‌న‌సేన‌కు ఈ ఎన్నిక‌లు కీల‌కంగా మార‌నున్నాయి. కూట‌మి అధికారంలోకి వ‌స్తుందా?  రాదా.. అనే విష‌యాలు ప‌క్క‌న పెడితే.. ఖ‌చ్చితంగా జ‌న‌సేకు గుర్తింపు రావాలంటే.. ప‌వ‌న్ ఇమేజ్ రాజ‌కీయంగా పెర‌గాలంటే మాత్రం పార్టీకి మెజారి టీ సీట్లు రావాల్సిన అవ‌స‌రం ఉంది. లేక‌పోతే.. ఇబ్బందులు త‌ప్ప‌వు. పైగా.. వ‌చ్చే ఐదేళ్ల‌పాటు.. పార్టీని న‌డిపించ‌డం కూడా.. మ‌రింత ఇబ్బంది అవుతుంద‌న‌డంలో సందేహం లేద‌ని పరిశీల‌కులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: