భ‌ర్త‌ల గెలుపు కోసం అత్తా - కోడ‌ళ్లు బ్రాహ్మ‌ణి, భువ‌నేశ్వ‌రి ఫ‌స్ట్ టైం ఇలా చేశారుగా... ఇదో హిస్ట‌రీయే...?

RAMAKRISHNA S.S.
నారా కుటుంబం అనగానే 45 ఏళ్ల రాజ‌కీయ చ‌రిత్ర క‌ళ్ల ముందు క‌నిపిస్తుంది. సుదీర్ఘ రాజకీయ ప్ర‌స్తానం ఉన్న కుటుంబంగా చ‌రిత్ర కూడా సృష్టించింది. ఒంట‌రిగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన చంద్ర‌బాబు ... త‌ర్వాత కాలంలో టీడీపీ అధినేత‌గా ఎదిగారు. 14 సంవ‌త్స‌రాలు ఉమ్మ‌డి-విభ‌జిత ఏపీ ముఖ్య‌మంత్రిగా కూడా ప‌నిచేశారు. అనేక సంస్క‌ర‌ణ‌లు తీసుకువ‌చ్చారు. సైబ‌ర్ సిటీని నిర్మించి.. ప్ర‌త్యేక హిస్ట‌రీ క్రియేట్ చేశారు. అనేక రంగాల్లో ఆయ‌న సంస్క‌ర‌ణ‌లు తెచ్చిన తీరు.. న‌భూతో అనాల్సిందే.

అలాంటి కుటుంబంలో ఎన్న‌డూ.. కూడా ఇంత అల‌జ‌డి రేగ‌లేదు. తాజాగా ఏపీలో ముగిసిన ఎన్నిక‌ల్లో నారా కుటుంబం.. అనేక విధాలుగా శ్ర‌మించింది. చంద్ర‌బాబును గెలిపించుకునేందుకు, నారా లోకేష్‌కు ఈ సారైనా విజ‌యం అందించేందుకు నారా భువ‌నేశ్వ‌రి, నారా బ్రాహ్మ‌ణిలు విశేషంగా క‌ష్ట‌ప‌డ్డారు. నియో జ‌క‌వ‌ర్గాల‌ను పంచుకుని మ‌రీ ప్ర‌చారం చేశారు. కుప్పంలో చంద్ర‌బాబు గ‌త 35 ఏళ్లుగా గెలుస్తున్నారు. అలాంటి నియోజ‌క‌వ‌ర్గంలో నారా భువ‌నేశ్వ‌రి తొలిసారి ప్ర‌త్యేక మేనిఫెస్టో ను ప్ర‌క‌టించారు.  

అంతేకాదు.. మెజారిటీ ఎక్కువ‌గా తీసుకువ‌చ్చే మండ‌లాల‌ను తాను ద‌త్త‌త తీసుకుని డెవ‌ల‌ప్ చేస్తామ‌ని చెప్పారు. నియోజ‌క‌వ‌ర్గంలో ఇంటింటికీ తిరుగుతూ.. భువ‌నేశ్వ‌రి ప్ర‌చారం చేశారు. ప్ర‌తి గ‌డ‌ప‌నూ స్పృశిం చారు. చంద్ర‌బాబును గెలిపించాలని అభ్య‌ర్థించారు. ఇక‌, నారా బ్రాహ్మ‌ణి అయితే.. మంగ‌ళ‌గిరిలో నెల రోజు ల‌ముందుగానే ప‌ర్య‌టించారు. పొలాగులు.. గుట్ట‌లు.. కొండ‌లు.. ఇలా అన్ని ప్రాంతాల్లోనూ క‌లియ దిరిగారు. ప్ర‌తిఒక్క‌రినీ క‌లుసుకున్నారు. ప్ర‌తి ఇల్లూ శోధించారు.

నారా లోకేష్‌ను గెలిపించాల‌ని.. నియోజ‌క‌వ‌ర్గాన్ని మోడ‌ర‌న్‌గా తీర్చిదిద్దుతామ‌ని కూడా హామీ ఇచ్చారు. మొత్తంగా చూస్తే.. ఎన్న‌డూ లేని విధంగా మంగ‌ళ‌గిరి, కుప్పం నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌త్యేక మేనిఫెస్టో ఇవ్వ డం.. రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలిస్తే.. అభివృద్ది చేస్తామ‌ని , మోడ‌ల్ నియోజ‌క‌వ‌ర్గాలుగా తీర్చిదిద్దుతా మ‌ని ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. గ‌త మూడు ద‌శాబ్దాల చ‌రిత్ర‌లో ఎన్న‌డూ ఇలా.. నారా కుటుంబం రోడ్డెక్క‌డం.. ఇల్లిల్లూ తిరిగి క‌ష్టాలు తెలుసుకోవ‌డం అనే మాటే లేదు. కానీ, ఇప్పుడు మాత్రం హిస్ట‌రీ క్రియేట్‌చేయ‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: