వైసిపి: సర్వే ఏదైనా రాయలసీమ బిడ్డకే హైప్.. అన్ని సీట్లతో ప్రభంజనం..!

Divya
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఈనెల 13వ తేదీన ఓటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యింది వచ్చే నెల నాలుగవ తేదీన ఫలితాలు వెలుగుబడునున్నాయి.. అయితే ఇప్పటికే ఎన్నో సర్వేలు సైతం ఏ ఏ పార్టీలో అధికారంలోకి వస్తాయని విషయాన్ని తెలియజేస్తూ వచ్చాయి.. ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించి రేపటి రోజు సాయంత్రానికి తేలనున్నాయి.. ఆ లోపుగా అంచనాల పేరుతో ఒక్కొక్కరు సైతం ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే విషయాన్ని లీక్ చేస్తూ ఉన్నారు. రేపటి రోజున ఆరా మస్తాన్ సాయంత్రం 6 గంటలకు చిలకలూరిపేటలో సర్వే విడుదల చేస్తామంటూ ప్రకటించారు.

ఈ సందర్భంలోనే ఆత్మసాక్షి సర్వే ప్రీపోల్ సర్వేను సైతం ప్రకటించింది పోస్ట్ పోన్ సర్వేని మాత్రం ఇంకా ప్రకటించలేదు.. ఆ స్టడీ అంటూ వాటి మీద మెన్షన్ చేసుకుంటూ.. వైసీపీ 110 నుంచి 122 స్థానాలు గెలుచుకుంటుంది అంటూ తెలియజేస్తోంది. 54 నుంచీ  64'స్థానాలలో కూటమి గెలుస్తుందనే విధంగా అంచనా వేస్తున్నట్లు తెలిపారు. వైసీపీ పార్టీకి ఓటు పర్సంటేజ్ విషయానికి వస్తే ..49.25% శాతం వస్తుందని.. కూటమికి 47.5% ఓట్లు వస్తాయని.. కాంగ్రెస్ కి 2.2% ఓటింగ్ వస్తుందని .. ఇతరులకు 1.05 వస్తుందంటూ ఆత్మసాక్షి సర్వే తెలియజేస్తోంది.

అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి.. మొన్న జరిగినటువంటి తెలంగాణ ఎన్నికలలో నాగన్న సర్వ్ కానీ ఆత్మ సాక్షి సర్వే కాని ఇద్దరు కూడా మిస్ మ్యాచ్ అయింది. అక్కడ అంచనాలను అందుకోలేకపోయారు. మరి ఇక్కడ ఏ మేరకు సక్సెస్ అవుతారో చూడాలి మరి. ఇటీవలే విదేశాలలో ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు మరి ఏ మేరకు మాట్లాడతారనే విషయం పైన అటు కార్యకర్తలు వైసీపీ నేతలు సైతం చాలా ఎక్సైటింగ్గా ఎదురుచూస్తున్నారు నిన్నటి రోజున ట్విట్టర్లో కూడా మళ్లీ పేదల ప్రభుత్వం వస్తుంది అనే విధంగా తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: