ఆ మాటతో జడ్జి మనస్సు గెలుచుకున్న జవహర్ రెడ్డి.. విమర్శలకు చెక్ పెట్టాడుగా?

Reddy P Rajasekhar
ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఏపీ ఎన్నికల సమయంలో జవహర్ రెడ్డి టార్గెట్ గా ఏపీ రాజకీయాలు జరిగాయి. ఎన్నికలు పూర్తైన తర్వాత కూడా ఆయనను సీఎస్ పదవి నుంచి తప్పించేలా పదేపదే టార్గెట్ చేస్తూ కొన్ని కథనాలు ప్రచురితమయ్యాయి. అయితే ఆ ఆరోపణలకు సీఎస్ జవహర్ రెడ్డి సైతం తనదైన శైలిలోనే జవాబులు ఇస్తుండటం గమనార్హం.
 
ఏపీ సీఎస్ అంటే ప్రతిపక్ష పార్టీల నేతలు మాత్రం టెన్షన్ పడుతున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా సీఎస్ గా పని చేస్తున్న జవహర్ రెడ్డి మంచి అధికారిగా గుర్తింపును సొంతం చేసుకున్నారు. గతంలో జవహర్ రెడ్డి లోకేశ్ విభాగంలో కూడా పని చేశారు. ఎన్నికల కౌంటింగ్ ముగిసే వరకే జవహర్ రెడ్డిని టార్గెట్ చేస్తారని ఆ తర్వాత ఏపీలో పరిస్థితి మళ్లీ సాధారణంగా ఉంటుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
 
ఏపీలో ఎన్నికల ముందు వరకు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ విషయంలో ఏ స్థాయిలో దుష్ప్రచారం జరిగిందో అందరికీ తెలుసు. అయితే సీఎస్ జవహర్ రెడ్డి గొప్పదనం గురించి చెప్పడానికి ఒకే ఒక్క ఉదాహరణ చాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఒకానొక సందర్భంలో జడ్జి టీచర్లు, ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించకపోవడం ఎప్పుడైనా చూశారా అని ప్రశ్నించారు.
 
ఆ ప్రశ్నకు సీఎస్ జవాబిస్తూ తన తండ్రి కూడా టీచర్ అని చిన్నతనంలో మూడు నెలలు జీతాల కోసం టీచర్లు ఆందోళన చేసిన ఉదంతం గుర్తు ఉందని ఆయన సమాధానం ఇచ్చారు. జీతాలు ఆలస్యంగా ఇవ్వడం కొత్తగా ఏం జరగడం లేదని పరిస్థితుల వల్ల కొన్నిసార్లు ఆలస్యంగా వేతనాలను చెల్లించడం జరుగుతుందని ఏపీ సీఎస్ చెప్పకనే చెప్పేశారని కామెంట్లు వ్యక్తమయ్యాయి. తను చేసిన కామెంట్లతో ఏపీ సీఎస్ జడ్జి మనస్సు సైతం గెలుచుకోవడంతో పాటు ఆయన ప్రశ్నకు తనదైన శైలిలో జవాబు ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: