ఓట్ల లెక్కింపులో.. ఒక రౌండ్ అంటే ఎన్ని ఓట్లో తెలుసా?

praveen
ఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులోకి వచ్చింది. ప్రతి విషయాన్ని కూడా ఎంతో సులభంగానే తెలుసుకోగలుగుతున్నాడు అందరూ. అయితే ఇటీవల కాలంలో ఏది హాట్ టాపిక్ గా మారిపోతే ఇక దాని గురించి అన్ని విషయాలు సోషల్ మీడియా ద్వారా అన్ని తెలిసిపోతున్నాయి.  ప్రస్తుతం ఇండియాలో ఎక్కడ చూసినా కూడా ఎన్నికల హడావిడి ఉంది. ఇక అన్ని రాష్ట్రాలలో కూడా ఎన్నికల పోలింగ్ ముగియడంతో.. జూన్ 4వ తేదీన ఫలితాలు రాబోతున్నాయి.

ఇక ఈ ఫలితాలు ఎవరికీ అనుకూలంగా రాబోతున్నాయి అనే విషయంపై అంతటా చర్చ జరుగుతుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏ పార్టీ మెజారిటీ స్థానాలలో విజయం సాధించబోతుంది అన్న విషయంపై అందరూ చర్చించుకుంటున్నారు అని చెప్పాలి. అయితే ఎన్నికల కౌంటింగ్ జరిగిన ప్రతిసారి కూడా మొదటి రౌండ్ రెండో రౌండ్ అంటూ ఇక ఫలితాలను విడుదల చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా మొదటి రౌండ్ అంటే ఎన్ని ఓట్లను లెక్కిస్తారు అన్న విషయం మాత్రం చాలా మందికి తెలియదు. ఇలా ఒక రౌండ్ పూర్తయిందని ఎలా నిర్ణయిస్తారు అన్న విషయం కూడా ఎవరికి క్లారిటీ ఉండదు.

 అయితే నిర్నిత ఓట్లను లెక్కించడమే మొదటి రౌండ్ అని పిలుస్తారట. ఆ వివరాలు చూసుకుంటే 14 ఈవీఎంలలోని ఓట్లు లెక్కించడం పూర్తయితేనే.. ఒక రౌండ్ ముగిసింది అని అంటారట. అయితే గదిలో 14 ఈవీఎంలను  14 టేబుల్ ల పై వేర్వేరుగా పెట్టి ఓట్లు లెక్కిస్తారు. ఇక ఒక బూత్ లోని ఓట్లన్నీ ఒక ఈవీయంలోనే ఉంటాయి. కాబట్టి 14 బూతులలో నమోదైన ఓట్ల మొత్తాన్ని కూడా లెక్కిస్తారు. ఇక ఈ లెక్కింపు పూర్తయిన తర్వాత మొదటి రౌండ్ పూర్తయింది అని ప్రకటిస్తారట. ఇక నియోజకవర్గంలోని ఓట్ల సంఖ్యను బట్టి రౌండ్ల సంఖ్య ఉంటుంది. ఎక్కువ ఓట్లు ఉంటే ఎక్కువ రౌండ్లు ఉంటాయి. తక్కువ ఓట్లు ఉంటే తక్కువ రౌండ్లు ఉంటాయట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: