టీడీపోతే : సైకిల్ ఓడిందా.. కేసీఆర్ లా బాబుకు పోరాటం తప్పదా?

praveen
మే 13వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ లో పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు విడుదల కాబోతున్నాయి. అయితే ఇలా పలు ఎన్నికల కౌంటింగ్ కి సమయం దగ్గర పడుతున్న కొద్ది.. ఆంధ్ర రాజకీయాల్లో అంతటా టెన్షన్ అంతకు అంతకు ఎక్కువ అయిపోతుంది. ఈసారి ప్రజలు ఎవరి వైపు నిలిచారు. ఎవరికి పట్టం కట్టబోతున్నారు అనే విషయంపై అంతటా చర్చ జరుగుతుంది. అయితే రెండోసారి అధికారాన్ని చేజిక్కించుకుంటామని వైసిపి.. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి వస్తామని కూటమి పార్టీలు భావిస్తూ ఉన్నాయి.

 అయితే పైకి తమదే అధికారం అని చెబుతున్నా.. ఇలా అన్ని పార్టీల నేతలు అందరూ కూడా ఏం జరగబోతుందో అనే విషయంపై మాత్రం కాస్త టెన్షన్ లోనే ఉన్నారు అని చెప్పాలి. అయితే ఈ ఎన్నికల్లో జగన్ ఎదుర్కొనేందుకు జనసేన, బిజెపి పార్టీలతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగింది టిడిపి. ఒకవేళ ఆ పార్టీ ఓడిపోతే పరిస్థితి ఏంటి అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది. ఇటీవల కాలంలో రాజకీయ విలువలను మరచిపోతున్న ఎంతోమంది నేతలు.. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి వలసలు వెళ్లడం చేస్తున్నారు  అప్పటివరకు అక్కున చేర్చుకున్న పార్టీని గురించి కాస్తయినా ఆలోచించడం లేదు. ఒకవేళ టిడిపి ఓడిపోతే కూడా ఆ పార్టీలో కీలక నేతలందరూ వైసీపీలోకి వెళ్లడం ఖాయంగానే కనిపిస్తుంది.

 అయితే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి ఓడిపోయిందా బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు పట్టిన పరిస్థితి  చంద్రబాబుకు పట్టడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు టీడీపీని నిలబెట్టడానికి పెద్దగా కష్టపడింది లేదు. ఎన్టీఆర్ టిడిపిని స్థాపించిన తర్వాత 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చింది సైకిల్ పార్టీ.  దీంతో పార్టీని నిలబెట్టేందుకు పెద్దగా కష్టపడలేదు. ఇక ఆ తర్వాత కాలంలో ఎన్టీఆర్ చేతుల్లో నుంచి టిడిపి చంద్రబాబు చేతుల్లోకి వచ్చేసింది. ఇక అప్పుడు ఆయన రాజకీయ అనుభవంతో ఇక పార్టీని నిలబెట్టుకో కలిగారు. కానీ కేసీఆర్ అలా కాదు ఏకంగా కొత్తగా పార్టీని స్థాపించి ఏమీ లేని దగ్గర నుంచి ఏకంగా అధికారంలోకి వచ్చేవరకు పోరాటం సాగించారు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ పార్టీని నిలబెట్టుకున్నారు. ఎవరు వెన్నుపోటు పొడిచిన బలంగా నిలబడ్డారు. అయితే ఇక ఇప్పుడు ఏపీలో టిడిపి ఓడిపోయిందంటే.. కేసీఆర్ లాగానే పార్టీని నిలబెట్టుకునేందుకు చంద్రబాబు తీవ్రమైన పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా. ఎందుకంటే టిడిపి ఓటిపోతే ఆ పార్టీలోని కీలక నేతలందరూ కూడా వైసీపీలో చేరిపోతారు. దీంతో పార్టీ ఖాళీ అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి పరిణామాలు నేపథ్యంలో చంద్రబాబు కెసిఆర్ లాగా పోరాటం చేసి పార్టీని నిలబెట్టుకుంటారా లేదా అనేది ప్రస్తుతం అందరిలో నెలకొన్న ప్రశ్న.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: