పోస్టల్ బ్యాలెట్: ఫలితాల వేళ ఈసీ మరో ట్విస్ట్..నేతల టెన్షన్ డబుల్..!

Divya
ఆంధ్రప్రదేశ్లో ఈసారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో భారీ గాని పోలింగ్ నమోదయింది. ఈ సమయంలోనే గత ఎన్నికలలో పోలిస్తే ఈసారి పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు కూడా భారీగానే పోలైనట్లుగా తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా అందరి దృష్టి పోస్టల్ బ్యాలెట్ వైపే పడింది.. సహజంగా ప్రభుత్వ వ్యతిరేకకు ప్రతిబింబంగా భావించే పోస్టల్ బ్యాలెట్ ఈసారి ఎక్కువగా పోలవడంతో అధికార పార్టీకి మైనస్ అవుతుందని చర్చలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈసీ పోస్టల్ బ్యాలెట్ల పైన జారీ చేసిన మార్గదర్శకాలు ఇప్పుడు అన్ని పార్టీలకు సైతం టెన్షన్ పెట్టేలా కనిపిస్తున్నాయి.

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల పైన కూడా అధికారికంగా సీల్ ఉండాలనే నిర్ణయాన్ని తీసుకుంది. దీంతో నేతలలో మరొకసారి టెన్షన్ పెరిగిపోయింది. అయితే సీలు లేకపోయినా చాలా రాష్ట్రాలలో పోస్టల్ బ్యాలెట్లు ఓట్లను అనుమతిస్తున్న ఈసీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం కచ్చితంగా సీలు ఉండాలని విధంగా స్పష్టం చేసింది. దీంతో ఓటు వేసిన ఉద్యోగులలో కూడా టెన్షన్ పెరిగిపోతోంది ఈ సమయంలోనే రాజకీయ పార్టీలు కూడా శీలు లేకుండా పడిన ఓట్లు  చెల్లుబాటుపైన టెన్షన్ మొదలయ్యింది.
తాజాగా పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు చెల్లింపు పై ఈసీ మరికొన్ని ఆదేశాలను కూడా జారీ చేసింది. ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ పేపర్ పైన అనుమానాస్పదంగా పేపర్ గుర్తించిన చిరిగిపోయిన చల్లదని బ్యాలెట్ అన్ని నిర్ధారించడానికి అవకాశం లేని సమయంలో రిటర్నింగ్ అధికారి ఇచ్చిన కవర్ బి లేకపోయినా ఆ పత్రం గుర్తించదని గుర్తులు చేతిరాతలు ఉన్న సందర్భాలలో కూడా ఈ పోస్టల్ బ్యాలెట్ తిరస్కరించబడుతుంది అంటూ తెలిపింది.

అలాగే ఉద్యోగి పోస్టల్ బ్యాలెట్ ఓటేసిన సమయంలో డిక్లరేషన్ ఫారం కవర్ బి లో లేకపోతే గెజిటెడ్ లేదా అసిస్టెంట్ ఆఫీసర్ సంతకం లేకపోయినా బ్యాలెట్ సీరియల్ నెంబర్లు వేరువేరుగా ఉన్న బ్యాలెట్ తెరవకుండానే తిరస్కరించవచ్చు అంటూ ఈసీ తెలియజేసింది. బ్యాలెట్ ధ్రువీకరణ అధికా రి సంతకం పై అనుమానం వచ్చినా కూడా సెంటర్ వద్ద రిటర్నింగ్ అధికారి వివరాలతో పోల్చి తగు నిర్ణయం తీసుకుంటారని తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: