ఏపీలో 46 ఏళ్లు గా ఒకటే సెంటిమెంట్.. ఈసారి అధికారం ఆ పార్టీదే‌‌..!

lakhmi saranya
ఏపీలో మే 13న ఎన్నికల పోలింగ్ జరిగింది. ఇక జూన్ 4న కౌంటింగ్ జరగబోతుంది. ప్రధానంగా వైసిపి, కూటమి మధ్యే గట్టి పోటీ ఏర్పడింది. ఈ క్రమంలోనే ఏ పార్టీ అధికారంలోకి వస్తుందోనన్న ఉత్కంఠ ప్రేక్షకుల్లో మరింత పెరిగింది. అయితే ఆ నాలుగు స్థానాల్లో ఏ పార్టీ గెలుస్తుందో అదే అధికార పీఠం దక్కించుకుంటుందని సెంటిమెంట్ వినిపిస్తుంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో భీమవరం, ఏలూరు, ఉంగుటూరు, పోలవరంలో ఏ అభ్యర్థులు అయితే గెలుస్తారో ‌ ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని బలమైన సెంటిమెంట్ ‌ నెలకొంది.

ఈ నాలుగు నియోజకవర్గాల్లో ఇప్పటివరకు అదే జరుగుతూ వచ్చింది. భీమవరం, ఏలూరు, ఉంగుటూరు, పోలవరంలో 1978 లో కాంగ్రెస్, 1983 అండ్ 85లో టిడిపి, 1989లో కాంగ్రెస్, 1994 అండ్ 99లో టిడిపి, 2004 అండ్ 2009 లో కాంగ్రెస్, 2014లో టిడిపి, 2019లో వైసీపీ విజయం సాధించాయి. అధికారిక పీఠాన్ని దక్కించుకున్నాయి. ఇక ఇప్పుడు కూడా ఏ పార్టీ అయితే ఈ నాలుగు చోట్ల గలుస్తుందో ఆ పార్టీ అధినేత రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు అన్న వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి.

ఇప్పటివరకు ఆ నాలుగు చోట్ల గెలిచిన పార్టీని అధికారంలోకి వచ్చింది. ఈ లెక్కను చూస్తే అదే సెంటిమెంట్ మళ్లీ రిపీట్ అవుతుందా లేదా అనేది చూడాలంటే ఎన్నికల ఫలితాల వరకు వెయిట్ చేయాల్సిందే. ఏకంగా ఈ సెంటిమెంట్ 46 ఏళ్ల నుంచి కొనసాగుతూ వస్తుంది. ఎప్పుడూ కూడా ఈ అంచనా తార్ మార్ అయ్యిందే లేదు. ఈ నాలుగు నియోజకవర్గాల్లో ఏ పార్టీ విజయం సాధిస్తే అదే పార్టీ అధికారంలోకి వచ్చింది.  ఈ నాలుగు ప్రాంతాల్లో ఎక్కువ ఏ పార్టీ గెలిస్తే ఈసారి కూడా అదే పార్టీ అధికారంలోకి వస్తుందని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: