ఏపీ ఎన్నికలు : సర్వేల కోసం కోట్లు పోసిన నేతలు... వాళ్లకు షాకులు..?
- భీమిలి ఫలితంపై అవంతి, గంటా సర్వేలు..?
( అమరావతి - ఇండియా హెరాల్డ్ )
గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల సమరం.. ప్రధాన పార్టీల అధినేత లకే కాదు.... ఒకింత పేరున్న నాయకులకు కూడా టెన్షన్ పుట్టేలా చేసింది. అయితే.. ప్రధాన పార్టీలు ఏక రీతిగా.. అంటే మొత్తం ఏపీ పరంగా చూసుకుంటే తమ పార్టీల పరిస్థితి ఏంటనేది సర్వేలు చేయించుకు న్నారు. ప్రజల నాడిని పట్టుకునే ప్రయత్నం చేశారు. వీటికి సంబంధించిన రిజల్ట్ పార్టీల వద్ద ఉందని తెలుస్తోంది.
అయితే.. ఇదేసమయంలో నాయకులు కూడా. తమ తమ జాతకాలు చూసుకున్నారు. పోలింగ్‌కు ముందు నుంచి కూడా.. వారు సర్వేలతో ముందుకుసాగారు. ఉదాహరణకు భీమిలిలో మాజీ మంత్రులు.. గంటా శ్రీనివాసరావు.. అవంతి శ్రీనివాసరావులు పోటీ చేశారు. ఇక్కడ హోరా హోరీ పోలింగ్ జరిగిందని అంచ నా. దీంతో వీరిద్దరూ కూడా సొంతగా తమ వారిని పెట్టి.. సర్వేలు చేయించుకున్నారు. నగరి నియోజకవ ర్గంలో మంత్రి రోజా కూడా సర్వే చేయించుకున్నారు.
అలాగే గుడివాడలోనూ ఇద్దరు కీలక నేతలు పోటీ చేయడంతో ... ఇక్కడ పరిస్థితి కూడా వేడెక్కింది. దీంతో ఒక పక్షం నాయకుడు తన జాతకాన్ని అంచనా వేయించుకున్నట్టు తెలిసింది. ఇక, విజయవాడలోని ఓ కీలక నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా టెన్షన్ నెలకొంది. దీంతో ఇక్కడ కూడా.. ఓ కీలక నాయకుడు.. తన గెలుపుపై ముందుగానే అంచనాలు వేసుకున్నారు. సర్వేలు కూడా చేయించుకున్నా రు. ప్రచారంలో ఉన్నప్పుడే... ఆయన సర్వేలను నమ్ముకోవడం గమనార్హం.
ఇక, గుంటూరు పార్లమెంటు సహా.. ఈ నియోజకవర్గంలోని పశ్చిమ, మంగళగిరి నియోజకవర్గాల్లోనూ.. సర్వే లు జరిగాయి. కీలక పార్టీల నేతలు.. వీటిని చేయించుకున్నారు. ఫలితాలు కూడా తెలిశాయి. ఎన్నికల ప్రచారం జరుగుతున్న సమయంలోనే.. ఈ సర్వేలు సాగడం.. పోలింగ్ తర్వాత కూడా.. రావడం.. వంటివి నాయకులకు వాస్తవ పరిస్థితిని తేల్చి చెప్పాయి. దీంతో కొందరు హ్యాపీగా ఉండగా.. మరికొందరు నిర్వేదంలో ఉన్నారు. అయితే.. ఈ సర్వేల కోసం.. నాయకులు రూ.కోట్లలో ఖర్చు చేయడం గమనార్హం.