ఏపీ: జగన్- చంద్రబాబుకు అందిన సర్వే రిపోర్ట్స్ క్లియరేనా..?

Divya
ఏపీలోని ఎన్నికల ఫలితాల పైన రోజురోజుకి ప్రజలకు ఉత్కంఠత పెరిగిపోతోంది. అన్ని పార్టీలు పైకి గెలుపు దిమాక్ కనిపిస్తున్న లోలోపల మాత్రం చాలా డైలమాలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. అయితే పార్టీ అధినేతలు మాత్రం పోలింగ్ తరలిపైన పూర్తిస్థాయిలో సమాచారం తెచ్చుకున్నట్లుగా కనిపిస్తోంది. ముఖ్యంగా నియోజకవర్గాల వారిగా తమకు వచ్చిన నివేదికలతో పాటు సర్వేల సంస్థల రిపోర్టు పైన చాలా కసరత్తు చేసినట్లుగా కనిపిస్తోంది. దీంతో ఆటటు టిడిపి వైసిపి కేడర్ కు ఇద్దరి అధినేతలకు ఫలితం పైన క్లారిటీ ఉన్నట్లుగా కనిపిస్తోంది.

ఏపీలో పోలింగ్ ముగిసి రెండు వారాలు అయ్యింది.. పోలింగ్ సరలి పైన అభ్యర్థుల నుంచి అధినేతల వరకు పూర్తి స్పష్టతతోనే ఉన్నట్టుగా కనిపిస్తోంది. కొంతమంది గెలుపు పైన ధీమాతో ఉన్నప్పటికీ మరి కొంతమంది డైలమాలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. అయితే ఓటింగ్ రోజు ఓటర్ల నాడి పసిగట్టే ప్రయత్నం చేశాయి కొన్ని సర్వే సంస్థలు. ఈ సర్వేలన్నీ కూడా అటు జగన్ కు ,టిడిపి అధినేత చంద్రబాబుకు ఇద్దరికీ కూడా అందించినట్లు సమాచారం. ఓటింగ్ పూర్తి అయిన తర్వాత జగన్ రెండు రోజుల పాటు పూర్తిగా ఓటింగ్ అనుకూలంగా ఉందనే అంశం పైన కసరత్తు చేసి కొన్ని లెక్కలు వేశారు.

పోలింగ్ కేంద్రాల నుంచి నియోజకవర్గాల లెక్కలు పథకాల లబ్ధిదారులు వైసిపికి అనుకూలంగా ఓటింగ్ పైన చర్చ జరిపిన తర్వాత ఐ ప్యాక్ టీమ్ తో మాట్లాడి.. తాము 2019 కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామని దీమాని తెలియజేశారు.2019 లో 151 ఎమ్మెల్యే 22 ఎంపీ సీట్ల కంటే ఎక్కువ గెలుస్తామని చెప్పడమే కాకుండా జూన్ 4న దేశం మొత్తం తన వైపు చూస్తుందని తెలియజేశారు.

అయితే ఆ సంస్థల నుంచి జగన్కు అందిన నివేదికలలో కూడా తాము అధికారంలోకి వస్తామని తెలియజేశారట. ఆ తర్వాతే తిరిగి విదేశీ పర్యటనలో వెళ్లిపోయినట్టు సమాచారం. ముఖ్యంగా సీఎం జగన్ పైన నేతలకు మాటమీద నమ్మకం ఉండడంతో ధీమాని వ్యక్తం చేస్తున్నారు.. అయితే ఇలాంటి స్పందన చంద్రబాబు క్యాంపు నుంచి రాలేదు.. ముఖ్యంగా చంద్రబాబు కూడా మూడు సర్వేలతో పాటు గతంలో కాంగ్రెస్ కోసం పనిచేసిన వ్యూహ కర్తకు నుంచి సర్వేలు తీసుకున్నట్లు సమాచారం. ఇందులో ఫలితం పైన క్లారిటీ ఉండడంతో కూటమి కూడా అధికారంలోకి వస్తుందని చంద్రబాబు ధీమాతో ఉన్నారు ఇలా ఎవరు విజయాన్ని వారు ధీమాతోనే తెలియజేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: