ఏపీ: టిడిపిపై నమ్మకం వదులుకున్న పవన్..2029 సీఎం పదవి టార్గెటా.?

Pandrala Sravanthi
పవన్ కళ్యాణ్ తెలుగు హీరోగా ఎంతో ప్రాచుర్యం పొందారు. ఎంతో సినీ బ్యాగ్రౌండ్ కలిగినటు వంటి పవన్ కళ్యాణ్  తన సొంత నటనా టాలెంట్ తో ఇండస్ట్రీలో ఎదిగారు. ఆయన ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. ఇదే తరుణంలో జనసేన పార్టీని స్థాపించి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసి ప్రతి నియోజకవర్గంలో వారి యొక్క  బలం ఏంటో నిరూపించుకున్నారు. ఈ విధంగా పవన్ తన సినిమా ఇమేజ్ మరియు సొంత ఇమేజ్ తో  ఆంధ్రప్రదేశ్ లో తన పార్టీని ఓ మోస్తారు లెవెల్ లో నిలబెట్టారని చెప్పవచ్చు. అంతేకాకుండా తనపై ఉన్నటువంటి ప్రత్యేక అభిమానం, మంచితనం  తన పార్టీ ఎదగడానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి. 

పవన్ కళ్యాణ్ కు మూడు పెళ్లిళ్లు అనే చిన్న మిస్టేక్ తప్ప అతన్ని తప్పు పట్టడానికి ఎలాంటి అవకాశాలు లేవు. ఎల్లప్పుడూ పేద ప్రజల కోసం పరితపించే పవన్ కళ్యాణ్ ను  ఈసారి టిడిపి తన కూటమిలో కలిపేసుకుంది. పవన్ కళ్యాణ్ ద్వారా అధికారంలోకి రావాలని ఎన్నో కుయుక్తులు పన్నారు టిడిపి నాయకులు. కానీ ఏది చేసినా   పరిస్థితి మాత్రం బెడిసి కొట్టిందని చెప్పవచ్చు.  పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరగడం పక్కన పెడితే  కేవలం పిఠాపురంలో గెలవడం కోసమే సర్వశక్తులు ఒడ్డారు. తనకు కేటాయించిన సీట్లలో వారిని గెలిపించుకోవాలని ప్రజలను కోరారు.  ఈ విధంగా పవన్ కళ్యాణ్ టిడిపితో పొత్తు పెట్టుకొని ఎన్నికల బరిలో నిలవడం  చాలామంది పవన్ అభిమానులకు నచ్చలేదట. అంతేకాదు ఆయన పొత్తు ఉన్న ఈసారి టిడిపి అధికారంలోకి వచ్చే అవకాశం కనిపించడం లేదు.

 దీంతో జనసేన నేతలంతా పొత్తు పెట్టుకోవడం తప్పైపోయిందని అంటున్నారట.  ఒకవేళ టిడిపి ఓడిపోతే మాత్రం, ఇక నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ప్రతిపక్షంలో బలమైన నేతగా పవన్ కళ్యాణ్ మాత్రమే ఎదిగే అవకాశం ఉంది. ఇదంతా గమనించిన పవన్ కళ్యాణ్ టిడిపి అధికారంలోకి రాకున్నా పర్లేదు,  పిఠాపురంలో గెలవాలని కంకణం కట్టుకున్నట్టు  తెలుస్తోంది. ఈసారి పవన్ కళ్యాణ్ బోనీ కొట్టి అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.  ఆయన అసెంబ్లీకి వచ్చిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ 2029లో ఎలాగైనా సీఎం రేసులో ఉండాలనేదే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారని తెలుస్తోంది. మరి చూడాలి పవన్ మనసులో అనుకున్నది నిజం అవుతుందా? లేదంటే టిడిపి కనుసనల్లోనే ఆయన నడుచుకుంటారా అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: