కన్ఫ్యూజన్ లో కూటమి.. వైసీపీ.. అసలు జనాలు ఏమనుకుంటున్నారు..?

Pulgam Srinivas
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని రోజుల క్రితమే ఎలక్షన్ లు ముగిశాయి. ఆ ఎలక్షన్ల కోసం రాజకీయ నాయకులు అంతా రెండు , మూడు నెలల పాటు విశ్రాంతి లేకుండా ఏ విధంగా జనాలను ఆకర్షించాలి , ఏ రకంగా ఓట్లను రాబట్టాలి అనే విషయంపై చర్చలు చేస్తూ ప్రచారాలను చేస్తూ సమయాన్ని గడిపారు. ఇక మే 13 వ తేదీన ఎలక్షన్లు పూర్తి అయ్యాయి. మొదటి నుండి కూడా ఎలక్షన్లలో ఎంత శాతం ఓటింగ్ జరుగుతుంది అనే దానిపై ఆంధ్ర రాష్ట్ర ప్రజలు , నాయకులు , కార్యకర్తలు ఎంతో ఆస క్తిగా ఎదురు చూస్తూ వచ్చారు.

ఇక అలాంటి సందర్భంలో ఈ సారి పోయిన సారి కంటే కాస్త ఎక్కువ గానే ఓటింగ్ శాతం రాష్ట్రంలో నమోదు అయ్యింది. దానితో కొంత మంది పోయిన సారి కంటే ఈ సారిఎక్కువ ఓటింగ్ జరిగింది కాబట్టి అది కూటమికి అనుకూలం అని అంటుంటే , మరి కొంత మంది అది వైసీపీ కి అనుకూలం అని అంటున్నారు. ఇక కూటమి నేతలు కార్యకర్తలు , ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసంతృప్తి తో ఉన్నారు. అందుకే పట్టణాల నుండి దేశ , విదేశాల నుండి ఓటర్లు తరలివచ్చి మాకు ఓటు వేశారు అని వారు చెబుతున్నారు. ఇక వైసీపీ వారు మేము ఇస్తున్న సంక్షేమ పథకాలకు జనాలు ఎంతగానో ఆకర్షితులయ్యారు. అందుకే మళ్ళీ మా ప్రభుత్వం అధికారంలోకి రావడానికి వారంతా ఎక్కడి నుండో తరలివచ్చి ఓట్లు వేశారు. అందుకే ఎక్కువ శాతం ఓటింగ్ జరిగింది అని వారు చెబుతున్నారు.

ఇలా ఈ ఇరు పార్టీలు ఈ ఓటింగ్ మాకు అనుకూలం అంటే మాకు అనుకూలం అంటూ ఉంటే జనాలు కూడా అసలు ఎవరికీ గెలుపు అవకాశాలు ఉన్నాయి అనేది తెలియక సతమతం అవుతున్నారు. ఇక ఒక వేళ జూన్ 4 వ తేదీన రాబోతున్న ఫలితాలలో కూటమి గనుక భారీ సీట్లను దక్కించుకుంటే ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నట్లే , ఒక వేళ జగన్ ప్రభుత్వం మరోసారి వచ్చినట్లు అయితే ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలకు జనాలు నిజంగానే ఆకర్షితులైనట్లు , మరి ప్రస్తుతం కన్ఫ్యూజన్ లో ఉన్న కూటమి , వైసీపీ ఆ రోజే అందులోనుండి బయటికి రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ap

సంబంధిత వార్తలు: