పసుపు దళం: ఉప సర్పంచ్ నుంచి ఎమ్మెల్యేగా.. పసుపు పార్టే ప్రాణంగా బోడే ప్రసాద్..!

Pandrala Sravanthi
- సీనియర్ ఎన్టీఆర్ పై అభిమానం.
- టిడిపి పార్టీ అంటే ప్రాణం.
- చంద్రబాబే బోడేకు ప్రధాన బలం..
-
 పసుపు పార్టీ అంటేనే  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాణంగా ప్రేమించే నాయకులు ఉంటారు. అన్న ఎన్టీఆర్ ఎప్పుడైతే ఈ పార్టీని స్థాపించారో అప్పటినుంచి చాలామంది ప్రజలు నాయకులు అది ఒక పార్టీలా చూడకుండా  సొంత కుటుంబ బాధ్యతగా తీసుకొని పసుపు పార్టీని   గుండెలకు హత్తుకున్నారు. 1982 మార్చి 29న మొదలైన తెలుగుదేశం ప్రస్థానం  ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఎన్టీఆర్ హయాంలో మొదటిసారి అధికారంలోకి వచ్చిన టిడిపి పార్టీ  ఎన్నో సంస్కరణలు, పథకాలు  తీసుకువచ్చి పేద ప్రజల పార్టీగా మిగిలిపోయింది. అలాంటి పార్టీనీ ప్రాణంగా ప్రేమించే నాయకుల్లో బోడె ప్రసాద్ కూడా ఒకరు. ప్రాణం పోయినా పార్టీ కోసం పేద ప్రజల కోసం పనిచేసే వ్యక్తి. అలాంటి బోడే ప్రసాద్ రాజకీయ ప్రస్థానం ఎక్కడి నుంచి సాగింది. చంద్రబాబుకు ఆయన ఎలా దగ్గరయ్యారు అనే వివరాలు చూద్దాం. బోడె ప్రసాద్ 1968 కృష్ణా జిల్లా పెనమలూరు లో జన్మించారు. బోడె ప్రసాద్ ఎలాంటి రాజకీయ ప్రస్థానం లేదు. అలాంటి బోడే ప్రసాద్  గ్రామస్థాయి నుంచి తన రాజకీయాన్ని టిడిపి తో స్టార్ట్ చేసి  ఎమ్మెల్యే దాకా ఎదిగారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహిత వ్యక్తిగా ఉన్నారు.

 రాజకీయ ప్రస్థానం:
 ఆయన సర్పంచ్ గా పోటీ చేయకముందే ఎన్టీ రామారావు మీద అభిమానంతో  టిడిపి పార్టీలో పని చేశారట. 2002లో క్రియాశీలక రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2006లో  పోరంకి గ్రామ ఉపసర్పంచిగా పనిచేసి, ప్రజల్లో మంచి ఆదరణ పొందారు. దీంతో ఆయన సేవలను గుర్తించిన చంద్రబాబు, 2010 నుండి పెనమలూరు మండలం టిడిపి అధ్యక్షుడిగా  కొనసాగారు.  2014లో పెనమలూరు నియోజకవర్గం నుంచి మొదటిసారి పోటీ చేసి తన సమీప వైసిపి అభ్యర్థి కుక్కల విద్యాసాగర్ పై 31 వేల ఓట్ల మెజారిటీ సాధించి మొదటిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. అలాంటి బోడే ప్రసాద్ 2019లో కూడా మరోసారి టికెట్ తెచ్చుకొని పోటీ చేశారు.  కానీ ఆయన సమీప వైసిపి అభ్యర్థి పార్థసారధి చేతిలో ఓటమిపాలయ్యారు. అయినా చంద్రబాబు వెన్నంటే ఉంటూ నియోజకవర్గంలో తిరుగుతూ గత ఐదు సంవత్సరాల నుంచి ప్రజల్లో మమేకమై ఉన్నారు. 2024 అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు బోడే ప్రసాద్  టికెట్ల కేటాయింపులో భాగంగా ముందుగా టికెట్ ఇవ్వలేమని చంద్రబాబు తెలియజేశారు. కానీ ప్రసాద్ ఆయన మాటకు అడ్డు చెప్పకుండా సరే అన్నారు. కానీ అనూహ్యంగా చంద్రబాబు మళ్లీ టికెట్ కేటాయించారు. దీంతో ఈసారి కూడా బోడె ప్రసాద్ బరిలో ఉన్నారు ఈయన సమీప అభ్యర్థిగా జోగి రమేష్ వచ్చారు. కానీ పెనమలూరులో ఈసారి  తప్పకుండా బోడే ప్రసాద్ గెలుస్తారని నమ్మకంతోనే చంద్రబాబు నాయుడు టికెట్ అందించారు. మరి చూడాలి చంద్రబాబు నాయుడు నమ్మకం  పెనమలూరులో నిలబడుతుందా అనేది తెలియాలంటే జూన్ 4వరకు వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: