వైసిపి:ఆరు జిల్లాలలో క్లీన్ స్వీప్ చేస్తుందా.. ఏ ఏ జిల్లాలంటే..?

Divya
ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికలు ముగిశాయి అభ్యర్థులను ఇప్పటికి ఇంకా టెన్షన్ పడుతూనే ఉన్నారు.. పోలింగ్ శాతం భారీగా పెరగడంతో అంచనాలు ఎవరికి అంత చిక్కడం లేదు.. కానీ ఎవరికి వారు తమకు అనుకూలంగానే పడ్డాయంటో చెప్పుకుంటున్నారు. గెలుపు ఎవరిది అనే విషయం జూన్ 4వ తేదీన తెలుస్తుంది. అయినప్పటికీ కూడా అనేక సర్వేలు సీనియర్ నాయకులు కూడా పలు రకాల విషయాలను తెలియజేస్తూ ఉన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పోలింగ్ శాతం పెరగడం వల్ల ఎవరికి ప్రయోజనం కలిగింది అనే విషయం పైన అంత చిక్కడం లేదు.

ప్రచారంలో జగన్ తమకు మంచి చేస్తేనే ఓటు వేయాలంటూ తెలియజేశారు  పేదలకు పెత్తందారులకు మధ్య పోటీ అంటూ అని వర్గాలను ఆకట్టుకున్నారు. దీంతోపాటు ప్రతి ఎన్నికల మాదిరిగానే కాకుండా ఇతర ప్రాంతాలలో కూడా ఓటర్లను తరలించడంలో వైసిపి ముందంజలోనే ఉన్నది. అలాగే కార్లు విమానాలు వచ్చిన వారు కూడా తమకు యాంటీగా చేసి ఉండవచ్చు అని అభిప్రాయం కూడా ఉన్నది కానీ వైసీపీలో మాత్రం ఈసారి తమదే గెలుపు దిమ్మ ఆత్మవిశ్వాసం చాలా పుష్కలంగా కనిపిస్తోంది.

ఇక మరొకవైపు కూటమి పార్టీలు కూడా అంతే నిర్భయంగా ఉంటున్నాయి.. ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందని ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వం మారితే అని ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు బాగుంటుందని అంచనా అని ప్రజలను పోలింగ్ వరకు తీసుకువచ్చింది అనంతల రూమర్స్ క్రియేట్ చేసుకున్నారు.. అలాగే సూపర్ సిక్స్ హామీలు వర్కౌట్ అయ్యాయని ఉచిత బస్సు తల్లికి వందనం మహిళలకు 1500 వంటి వాటితో పాటు మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీ పనిచేసింది అని అందుకే మహిళలు పెద్ద ఎత్తున ఓట్లు వేశారని భావిస్తున్నారు.

అయితే ఐప్యాక్ సంస్థ మాత్రం జగన్కు ఇచ్చిన నివేదికలో 156 స్థానాలు వస్తాయని చెప్పినట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నది. ముఖ్యంగా ఆరు జిల్లాలలో వైసిపి క్లీన్ స్వీప్ చేస్తుందని సమాచారం.. గత ఎన్నికలలో మాదిరే కర్నూలు, కడప, నెల్లూరు ,విజయనగరం జిల్లాలలో వైసిపి క్లీన్ స్వీట్ చేస్తుందని ఈసారి మరొక రెండు జిల్లాలు అదనంగా క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉన్నట్లు నివేదిక రావడంతో వైసిపి నేతలు ఆనందానికి అవధులు లేవు. మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో తెలియదు కానీ.. ఈ విషయమైతే అటు కూటమిని కూడా భయపెడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: