కష్టమైనా నష్టమైనా జగన్ వెంటే.. విజయసాయి విషయంలో సీఎం చాలా లక్కీ!

Reddy P Rajasekhar
సాధారణంగా రాజకీయాల్లో గెలిచిన సమయంలో అండగా నిలబడిన వ్యక్తులు ఓడిన సమయంలో పక్కన ఉండటానికి ఇష్టపడరు. కష్టమైనా నష్టమైనా వెంటనడిచే వాళ్లు చాలా తక్కువమంది ఉంటారు. అలా జగన్ అత్యంత నమ్మదగిన వ్యక్తులలో విజయసాయిరెడ్డి ఒకరని చెప్పడంలో సందేహం అవసరం లేదు. విజయసాయిరెడ్డి వైసీపీ తరపున రెండుసార్లు రాజ్యసభ సభ్యునిగా ఎంపికయ్యారు.
 
వైఎస్ జగన్ పాదయాత్ర చేసిన సమయంలో విజయసాయిరెడ్డి వైసీపీని తన భుజస్కందాలపై మోశారు. జగన్ కు కష్ట సమయాలలో విజయసాయిరెడ్డి అండగా నిలవడంతో పాటు రాజకీయాల్లో జగన్ సక్సెస్ వెనుక కీలక పాత్ర పోషించారు. విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తి తన జీవితంలో ఉన్నందుకు సీఎం జగన్ నిజంగా అదృష్టవంతుడే అని వైసీపీ అభిమానులు సైతం భావిస్తారనే సంగతి తెలిసిందే.
 
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం పలు సందర్భాల్లో విజయసాయిరెడ్డి గురించి ప్రస్తావించారంటే ఈయన ప్రతిభ గురించి సులువుగా అర్థమవుతుంది. ఏపీ అభివృద్ధి కోసం తన వాదాన్ని కేంద్రానికి చెందిన విజయసాయిరెడ్డి పార్లమెంట్ సమావేశాలలో పలు ప్రైవేట్ బిల్లులను ప్రవేశపెట్టడం గమనార్హం. జగన్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూనే కూటమి నేతల పరువు తీసే విషయంలో విజయసాయిరెడ్డి ముందువరసలో ఉంటారు.
 
విజయసాయిరెడ్డి తాజా పోస్ట్ లో 2019 ఎన్నికల్లో టీడీపీకి 23 సీట్లు వచ్చాయని వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనడంతో పాటు మే 23వ తేదీన కౌంటింగ్ జరగడంతో 23 స్థానాలు వచ్చాయని విజయసాయిరెడ్డి అన్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ నేతలైన కోటంరెడ్డి, ఆనం, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలను కొన్నావని జూన్ 4న కౌంటింగ్ జరగబోతుందని ఆ లెక్క ప్రకారం కూటమికి వచ్చేవి 4 స్థానాలే అంటూ కామెంట్లు చేశారు. విజయసాయిరెడ్డి ఛార్టెడ్ అకౌంటెంట్ అనే సంగతి కూడా తెలిసిందే. జగన్ అక్రమార్కుల కేసులో విజయసాయిరెడ్డిపై సైతం ఆరోపణలు వినిపించినా విజయసాయిరెడ్డి తాను కానీ జగన్ కానీ ఎలాంటి తప్పు చేయలేదని ఎప్పటికైనా నిజమే గెలుస్తుందని చెబుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: