జ‌గ‌న్ బ‌ల‌గం : ఐఏఎస్ ప్ర‌వీణ్ ప్ర‌కాష్ ఓ హీరో అంతే..!

RAMAKRISHNA S.S.
- ప్ర‌వీణ్ ప్ర‌కాష్‌ను ఢిల్లీ నుంచి ఏపీకి తీసుకొచ్చిన జ‌గ‌న్‌
- పెను మార్పుల‌తో ఏపీ విద్యావ్య‌వ‌స్థ‌ స‌క్సెస్
- నాడు నేడుతో జ‌గ‌న్ స‌ర్కార్‌కు తిరుగులేని ప్ర‌శంస‌లు
( ప్ర‌కాశం - ఇండియా హెరాల్డ్ )
స‌హ‌జంగా ముఖ్య‌మంత్రి స్థానంలో ఉన్న‌వారికి.. చాలా మంది ఐఏఎస్‌లు చ‌నువుగా ఉంటారు. ఏ రాష్ట్రం తీసుకున్నా.. ముఖ్య‌మంత్రి కార్యాల‌యంలో ప‌దుల సంఖ్య‌లో ఉండే ఐఏఎస్‌లు.. సీఎం క‌నుస‌న్న‌ల్లో ప‌డాల‌ని కోరుకుంటారు. ఇది త‌ప్పుకాదు. పాల‌న ప‌రంగా ముఖ్య‌మంత్రి సీనియ‌ర్ ఐఏఎస్‌ల‌పైనే ఆధార ప‌డి ఉంటారు కాబ‌ట్టి దీనిని త‌ప్పుప‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు. ఏపీ విష‌యానికివ‌స్తే.. ఒకే ఒక్క ఐఏఎస్‌.. మాత్రంఅంద‌రినీ మించి.. ముఖ్య‌మంత్రి క‌నుస‌న్న‌ల్లో ఉన్నారంటే ఆశ్చ‌ర్యం వేస్తుంది.

ఆయ‌న ఏం చెప్పినా.. సీఎం జ‌గ‌న్‌కు వేదం. నిజానికి ఎక్క‌డైనా సీఎంలు చెప్పింది వింటారు.. కానీ, ఇక్క‌డ రివ‌ర్స్‌. ఈ ఐఏఎస్ చెప్పింది.. సీఎం జ‌గ‌న్ పాటిస్తారు. ఆయ‌నే సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి ప్ర‌స్తుత విద్యాశాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ.. ప్ర‌వీణ్ ప్ర‌కాష్‌. గ‌తంలో ప‌లు జిల్లాల్లో క‌లెక్ట‌ర్‌గా ప‌నిచేసిన ఆయ‌న‌.. ఏపీ ఏర్ప‌డిన త‌ర్వాత‌.. డిల్లీలో ఏపీ భ‌వ‌న్ సెక్ర‌ట‌రీగా ప‌నిచేశారు. సీఎం జ‌గ‌న్ వ‌చ్చిన త‌ర్వాత‌.. ప‌నిగ‌ట్టుకుని ఆయ‌న‌ను ఢిల్లీ నుంచి తీసుకువ‌చ్చి.. ఏపీలో నియ‌మించుకున్నారు.

ఆయ‌న‌కు తొలుత  మునిసిప‌ల్ శాఖ విదులు అప్ప‌గించారు. ఆ త‌ర్వాత విద్యాశాఖ విదులు అప్ప‌గించా రు. ఆయ‌న ప‌నిచేయ‌డ‌మే కాదు.. ప‌నిని ప్రోత్స‌హిస్తార‌నే మంచి పేరు తెచ్చుకున్నారు. ప‌నితీరులో చిన్న లోపం వ‌చ్చినా.. ఆయ‌న ఊరుకునే స్వ‌భావం ఉన్న అధికారి కాదు. నిరంతరం.. పాఠ‌శాల‌ల‌ను ప‌రిశీలించ‌డం.. చిన్న గ్రామమైనా కూడా.. తాను స్వ‌యంగా వెళ్ల‌డం.. ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న విద్యావ్య‌వ‌స్థ‌పై అవ‌గాహ‌న క‌ల్పించ‌డం.. ఆయ‌న చేశారు. ఇది స‌ర్కారుకు మంచి పేరు తెచ్చింది.

నిజానికి రాష్ట్రంలో బైజూస్ పాఠ్యాంశాలు.. ట్యాబులు.. వంటివి రావ‌డానికి.. ప్ర‌వీణ్ ప్ర‌కాష్ సూచ‌న‌లే కార‌ణం. వాస్త‌వానికి వాటిని మేనిఫెస్టోలో పెట్ట‌లేదు. అయినా. కూడా ప్ర‌వీణ్ ప్ర‌కాష్ సూచ‌న‌ల‌తో వాటిని సీఎం జ‌గ‌న్ తీసుకువ‌చ్చారు. ఇక్కడ చిత్ర‌మైన వ్య‌వ‌హారం ఏంటంటే.. ప్ర‌వీణ్ చెప్పింది.. సంపూర్ణంగా విశ్వ‌సించ‌డం. ఇలానే ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యాన్ని సీఎం జ‌గ‌న్ ప‌క్క‌న పెట్ట‌డానికి కార‌ణం ప్ర‌కాషేన‌ని అంటారు. ఏదేమైనా.. కొంత అతిశ‌యోక్తి ఉన్నా.. మెజారిటీ ప‌నులు చూస్తే.. ప్ర‌వీణ్ ప్ర‌కాష్ స‌క్సెస్ అయ్యార‌ని అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: