హ్యాట్రిక్ సాధించాలన్న రోజా కల కల్లేనా.. ఆ తప్పుల వల్లే రోజాకు ఓటమి ఖాయమా?

Reddy P Rajasekhar
2024 ఎన్నికల్లో వైసీపీ కచ్చితంగా ఓడిపోయే స్థానం ఏదనే ప్రశ్నకు నగరి నియోజకవర్గం పేరు సమాధానంగా వినిపిస్తోంది. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే నగరిలో రోజాకు వైసీపీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఆమె ఓడిపోవడం ఖాయమని ప్రచారం జరిగింది. రోజాకు టికెట్ ఇవ్వడం వల్ల నియోజకవర్గంలో చాలామంది వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరి ఆ పార్టీ గెలుపు కోసం కృషి చేయడం జరిగింది.
 
రోజా అవినీతి చేశారని కొంతమంది ఆరోపణలు చేస్తుండగా పార్టీలో రోజా కుటుంబ సభ్యుల పెత్తనం భరించలేక మరి కొందరు కార్యకర్తలు, నేతలు టీడీపీకి సపోర్ట్ చేసినట్టు తెలుస్తోంది. రోజా హ్యాట్రిక్ సాధించాలన్న కలలు కల్లలయ్యే పరిస్థితి నెలకొందని ఈ నియోజకవర్గంలో టీడీపీ గెలిచే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. రోజా ఎన్నికల్లో ఓడిపోతే ఆమె భవిష్యత్తు ఏంటనే ప్రశ్నలు సైతం వ్యక్తమవుతున్నాయి.
 
వైసీపీ నేతలు, కార్యకర్తలు రెబల్స్ గా మారి ప్రచారం చేయడం ఆమెకు మైనస్ అయింది. గాలి భానుప్రకాశ్ ఈ ఎన్నికల్లో నగరి నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో ఎమ్మెల్యే కావడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి. కొంతమంది వైసీపీ పెద్దలు సైతం ఆమెకు వ్యతిరేకంగా ప్రచారం జరిగింది. రోజాకు స్థానికంగా పూర్తిస్థాయిలో వ్యతిరేక పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.
 
నగరిలో వైసీపీ గెలుపు కోసం స్వయంగా సీఎం జగన్ ప్రచారం చేసినా ఫలితం లేకుండా పోయిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కుప్పంలో వైసీపీ గెలవొచ్చని నగరిలో వైసీపీ ఓడిపోవచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ ఎన్నికల్లో అటు టీడీపీ కంచుకోటల్లో, ఇటు వైసీపీ కంచుకోటల్లో షాకింగ్ ఫలితాలు రానున్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. నగరిలో రోజా ఓడిపోతారని జగన్ కు అవగాహన ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.  రోజా ఓడిపోతే భవిష్యత్తులో నగరి నుంచి ఆమె గెలవడం సులువు కాదని ప్రచారం జరుగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: