కర్నూలు జిల్లాలో టీడీపీ కచ్చితంగా గెలిచే స్థానమిదే.. ఆ వ్యూహాలు ఫలించాయా?

Reddy P Rajasekhar
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో టీడీపీ కచ్చితంగా గెలిచే ఒకే ఒక్క నియోజకవర్గం ఏదనే ప్రశ్నకు కర్నూలు అసెంబ్లీ అనే సమాధానం వినిపిస్తోంది. ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ తరపున టీజీ భరత్ పోటీ చేయడం టీడీపీకి ప్లస్ అయిందని తెలుస్తోంది. కర్నూలు జిల్లాలో టీడీపీ కచ్చితంగా గెలిచే స్థానమిదే అంటూ సర్వేలలో సైతం వెల్లడవుతూ ఉండటం గమనార్హం.
 
టీజీ భరత్ కూటమి మేనిఫెస్టోను ప్రచారం చేయడంతో పాటు తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కర్నూలు జిల్లాను ఏ విధంగా అభివృద్ధి చేయాలని భావిస్తున్నారో కూడా చెప్పుకొచ్చారు. తాను లోకల్ అభ్యర్థినని ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని ప్రచారం చేసుకోవడం కూడా టీజీ భరత్ కు పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. టీజీ భరత్ స్థానికంగా కొన్ని పరిశ్రమలు స్థాపించి ఎంతోమందికి ఉద్యోగాలు ఇచ్చారు.
 
జిల్లాలో మంచి పేరు ఉండటం టీజీ భరత్ కు కలిసొచ్చింది. కర్నూలును స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడానికి టీజీ భరత్ వద్ద అద్భుతమైన ప్రణాళికలు ఉన్నాయని తెలుస్తోంది. వైసీపీ నుంచి ఇంతియాజ్ పోటీ చేయగా టీజీ భరత్ తో పోల్చి చూస్తే జిల్లా ప్రజలకు ఆయన గురించి పెద్దగా తెలియదు. 99 శాతం టీజీ భరత్ గెలుపుకే ఛాన్స్ ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. టీజీ భరత్ కుటుంబ సభ్యులు ప్రజలకు ప్రయోజనం చేకూరేలా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు..
 
జూన్ 4వ తేదీన వెలువడే ఫలితాల్లో భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని టీజీ భరత్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. కర్నూలులో క్రాస్ ఓటింగ్ జరిగిందని కూడా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యే ఓటు టీడీపీ అభ్యర్థి అయిన టీజీ భరత్ కు ఎంపీ ఓటు వైసీపీ అభ్యర్థి అయిన బీవై రామయ్యకు పోల్ అయినట్టు ప్రచారం జరుగుతుండటం గమనార్హం. ఈ ప్రచారం నిజమో కాదో తెలియాలంటే మాత్రం ఫలితాలు వెలువడే వరకు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: