ఆలయాల విషయంలో మోదీ కీలక నిర్ణయం.. చాలదు అంటున్న ప్రజలు..?

Suma Kallamadi
దేవాలయాలలో లైబ్రరీలను ఏర్పాటు చేయాలని మోదీ ప్రభుత్వం యోచిస్తుంది. సాధారణంగా ప్రజలు ఒక గుడికి వెళ్ళినప్పుడు ఆ దేవుడు, హిందూ సంప్రదాయాలు, సంస్కృతుల గురించి తెలుసుకోవాలనుకుంటారు. అలానే మత గ్రంథాలను కూడా చదవాలనుకుంటారు. కానీ ప్రస్తుతం భారతదేశంలో ఉన్న దేవాలయాలలో పుస్తకాలు అందుబాటులో లేవు. చిన్నచిన్న వివరాలు రాతి ఫలకాలపై రాసి ఉంటాయి కానీ వాటికంటే ఎక్కువ నాలెడ్జి పొందాలనుకునే వారికి మాత్రం అది సాధ్యపడటం లేదు.
ఇటీవల ఒక ఇస్రో అధికారి దేవాలయాలలో లైబ్రరీ ఉండటం తప్పనిసరి అని సూచించారు. ఆ ఆలోచన మొదట ఆయనకు వచ్చిందో తెలియదు, లేదంటే బీజేపీ ప్రభుత్వం చేసిన ఆలోచన గురించి ఆయన జనాలకు వెల్లడించారో తెలియదు కానీ కేంద్ర ప్రభుత్వం అయితే ప్రముఖ దేవాలయాలలో లైబ్రరీలను ఏర్పాటు చేయడానికి చేయడానికి సిద్ధమయినట్లు తెలుస్తోంది. బీజేపీ ఎప్పుడు కూడా హిందూ మతాలను దేవాలయాలను కాపాడేందుకు కృషి చేస్తుంది కొత్త దేవాలయాలను నిర్మించడంపై దృష్టి సారిస్తుంది. అలాగే హిందూ మతం గురించి ప్రజలకు తెలియజేయడానికి ప్రయత్నిస్తుంది. అందులో భాగంగా లైబ్రరీలను దేవాలయాల్లో నిర్మించాలని కూడా నిర్ణయించింది.
అయితే చాలామంది ప్రజలు ఒక లైబ్రరీ మాత్రమే చాలదని వేద పాఠశాలలను ప్రముఖ దేవాలయాలలో ప్రారంభించాలని కోరుతున్నారు. లోక్ సభ ఎన్నికల తర్వాత కేంద్రం దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆ దేవాలయాలలో విలువైన పుస్తకాలతో లైబ్రరీలను ఏర్పాటు చేయవచ్చు. ఇకపోతే ఈసారి మళ్లీ మోడీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మెజారిటీ తగ్గవచ్చేమో కానీ కాంగ్రెస్ లేదా I.N.D.I.A కూటమి గెలవడం అసాధ్యమని అంటున్నారు.
ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికలు కొనసాగుతున్నాయి. జూన్ 4న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఆ రోజుతో ఏపీ రాష్ట్రంలో సీఎం ఎవరు, కేంద్రంలో పీఎం ఎవరు అనేది తెలిసిపోతుంది. చూడాలి మరి ఎవరి భవిష్యత్తు ఎలా ఉంటుందో. ఏపీలో బీజేపీ టీడీపీతో కలిసి మరీ పోటీ చేసింది. ఓడిపోతే బీజేపీకి పోయేదేమీ లేదు కానీ చంద్రబాబు, పవన్ బాగా దెబ్బ అయిపోతారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: