ఏపీ: కూటమి గెలిస్తే.. ఆ పథకాలాన్ని గోవిందా..!

Divya
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో భాగంగా కూటమి గా (టిడిపి, జనసేన, బిజెపి పార్టీ) పోటీ చేశాయి.. ముఖ్యంగా అధికార పార్టీ వైసిపినీ ఎదుర్కోవడానికి తీవ్ర వ్యూహాలను కూడా రచించాయి. ముఖ్యంగా మేనిఫెస్టో విషయంలో కూడా చాలా జాగ్రత్తగా కూటమి వ్యవహరించింది. కర్ణాటక ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని కూడా అమలు చేశారు. ఇది కర్ణాటక ప్రాంతంలో అధికారం రావడానికి మూల కారణమైనప్పటికీ ప్రస్తుతం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.

ఆటో వాళ్లకు పని లేకుండా చేస్తున్నారని.. కర్ణాటక ప్రభుత్వం ఇన్కమ్ కూడా పడిపోయిందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కూడా ఇదే విషయాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పుడు లోక్ సభ ఎన్నికలు కూడా జరగడంతో కాంగ్రెస్ పోటీ చేస్తున్న ఇతర రాష్ట్రాలలో కూడా ఇదే పథకాన్ని ప్రవేశపెట్టాలని చూస్తుందట. ఇప్పుడు ఈ పథకాన్ని తెలుగుదేశం జనసేన మేనిఫెస్టోలో ప్రకటించబడ్డాయి. కూటమి అధికారంలోకి వస్తే ఆంధ్రలోని మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు.

అయితే ఇప్పటికే ప్రధాన మోడీ మాత్రం ఇలాంటి పథకాలకు మక్కువ చూపలేదు.. ఇలాంటి పథకాలను అమలు చేస్తున్న రాష్ట్రాల పైన కూడా మండిపడ్డారు.. ఇలా చేయడం వల్ల అభివృద్ధి జరగదని ప్రతి ఐదేళ్లకు ఒక్క సారి బస్సుల మెయింటైన్ కోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చవుతుందని కూడా తెలిపారు.ఆ ఖర్చులను ఎలా భరిస్తారని కూడా ప్రశ్నించారు.. అంతేకాకుండా ఇతర పార్టీల మేనిఫెస్టో మార్చే హక్కు ప్రధానికి లేదు.. కాబట్టి కూటమిలో కచ్చితంగా ఉచిత పథకాల విషయంలో ఇచ్చే అవకాశం కూడా ఎక్కువగా కనిపించదని వార్తలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.. మరి ఒకవేళ ఆంధ్రప్రదేశ్లోని ఫలితాలు కూటమికి సపోర్టుగా వస్తే ఏం జరుగుతుందో చూడాలి లేకపోతే అధికార పార్టీ వైసీపీ గెలిస్తే యధావిధిగా పథకాలను కొనసాగిస్తారని  చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: