తెలంగాణాలో మెజారిటీ బిజెపిదే.. కాంగ్రెస్ నేత రివ్యూ.. షాక్ లో హస్తం పార్టీ?

praveen
మే 13వ తేదీన 17 పార్లమెంటు స్థానాలకు గాను తెలంగాణలో ఎన్నికలు జరిగాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలలో విజయం సాధించడం కోసం ప్రధాన పార్టీలుగా కొనసాగుతున్న బిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి పార్టీలు తీవ్రంగానే శ్రమించాయి. ఇక తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు శతవిధాల ప్రయత్నించాయి. ఓటర్లు ఎవరి భవితవ్యం ఎలా తేల్చారు  అన్నది మాత్రం.. జూన్ 4వ తేదీన తేలబోతుంది అన్న విషయం తెలిసిందే.

 ఈ క్రమంలోనే ఎన్నికల పోలింగ్ పూర్తయిన నేపథ్యంలో ఈసారి ఆయా పార్లమెంట్ సెగ్మెంట్లలో ఉన్న రాజకీయ సమీకరణాల దృశ్య ఏ పార్టీ విజయం సాధించబోతుంది అనే విషయంపై ఎంతో మంది రాజకీయ విశ్లేషకులు కూడా రివ్యూలు ఇచ్చేస్తున్నారు. ఈ క్రమంలోనే దిగ్గజ విశ్లేషకుడిగా పేరు సంపాదించుకున్న మాజీ శాసనసభ్యుడు కాంగ్రెస్ నేత గోనె ప్రకాష్ రావు ఇచ్చిన రివ్యూ కాస్త తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది  ఈ పార్లమెంటు ఎన్నికల ఫలితాలలో ఆరు స్థానాలలో బిజెపి,ఐదు స్థానాలలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని గోనె ప్రకాష్ రావు చెప్పుకొచ్చారు.

 బిజెపి 6, కాంగ్రెస్ ఐదు, ఎంఐఎం ఒకటి, ఐదు పార్లమెంట్ సెగ్మెంట్లో టఫ్ ఫైట్ ఉంది అంటూ ఆయన చెప్పుకొచ్చారు. అయితే  ఇలా టఫ్ ఫైట్ ఉన్న ఐదు పార్లమెంట్ సెగ్మెంట్లలో కూడా భువనగిరి, జహీరాబాద్, మహబూబ్నగర్లో బీజేపీ ఎడ్జ్ ఎక్కువ ఉంది అంటూ ఆయన రివ్యూ ఇచ్చారు. ఒక వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్లో అటు కాంగ్రెస్కు ఎడ్జ్ ఉంది అంటూ తెలిపారు. అదిలాబాద్ లో బిజెపి, భువనగిరి బిజెపి- కాంగ్రెస్ మధ్య క్లోజ్ ఫైట్, చేవెళ్లలో బిజెపి, హైదరాబాద్ లో ఎంఐఎం, కరీంనగర్ లో బిజెపి, ఖమ్మంలో కాంగ్రెస్, మహబూబాబాద్ లో  కాంగ్రెస్, మహబూబ్నగర్లో కాంగ్రెస్ - బిజెపి మధ్య ఫైట్, మల్కాజ్గిరి లో బిజెపి, నాగర్ కర్నూల్ లో కాంగ్రెస్, నల్గొండలో కాంగ్రెస్, నిజాంబాద్ లో బిజెపి, పెద్దపల్లిలో కాంగ్రెస్,సికింద్రాబాద్లో బిజెపి, వరంగల్లో బిజెపి - కాంగ్రెస్ మధ్య ఫైట్, జహీరాబాద్ లో బీజేపీ - కాంగ్రెస్ ఫైట్, మెదక్ లో బిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి మధ్య ఫైట్ ఉంటుందని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Bjp

సంబంధిత వార్తలు: