ఆ విషయం.. తెలంగాణను చూసి ఆంధ్ర నేర్చుకోవాలేమో?

praveen
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావిడి ముగిసింది. పోలింగ్ ప్రక్రియ పూర్తికావడంతో ఒక్కసారిగా రాజకీయ వేడి చల్లారింది. అయితే ఒక తెలంగాణలో మాత్రమే పరిస్థితి ఇలా ఉంది. ఆంధ్రప్రదేశ్లో మాత్రం పరిస్థితి మరోలా ఉంది. సాధారణంగా అయితే ఎక్కడైనా పోలింగ్ ముగిసిన తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా అదుపులోకి వస్తాయి. ఎక్కడ ప్రచారాలు, విమర్శలు ప్రతి విమర్శలు కనిపించవు. కానీ ఆంధ్రాలో పోలింగ్ ముగిసిన తర్వాత ఒక పార్టీ నేతలు మరో పార్టీ నేతలపై దాడులు చేయడం లాంటి ఘటనలు సంచులనంగా మారిపోయాయి.

 ఈ క్రమంలోనే ఇలా పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా చాలా చోట్ల ఏకంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయ్. ఇక పోలీసులు 144 సెక్షన్ విధించి కఠినంగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఏపీలో ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో మరో కొత్త విషయాన్ని కూడా అటు రాజకీయ విశ్లేషకులు తెరమీదకి వస్తున్నారు. ఆంధ్ర రాజకీయ నాయకులు తెలంగాణ నాయకులను చూసి నేర్చుకోవాల్సిన విషయం చాలా ఉంది అంటూ చెబుతున్నారు. సాదరణంగా ఆంధ్రాలో ఎవరు అధికారంలో ఉన్న ప్రతిపక్ష పార్టీ నేతలు వారిని కలవడం గానీ.. ఏదైనా సమస్యపై వినతిపత్రం ఇవ్వడం కానీ ఇప్పటివరకు జరగలేదు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్  గానీ.. మొన్న జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు గాని.  ఇలా సమస్యలను పరిష్కరించాలి అంటూ ఒక వినతి పత్రం ఇచ్చిన సందర్భం ఒకటి కూడా లేదు.

 చంద్రబాబు మాత్రమే కాదు ఆయా పార్టీల నేతలు కూడా ఇదే వైఖరితో ఉన్నారు. కానీ తెలంగాణలో అలా కాదు గతంలో బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులు.. ఇక ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు ఇక ఇటీవల బీజేపీ ఎమ్మెల్యేలు కూడా అటు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని.. ఇక రైతుల సమస్యలను తీర్చాలి అంటూ ఎన్నో సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి కి వినతి పత్రం అందించారు. ఇలా ఎన్నికల సమయంలో ఎన్ని విమర్శలు చేసుకున్న.. పోలింగ్ ముగిసిన తర్వాత మాత్రం మళ్లీ ప్రజా సంక్షేమమే ముఖ్యం అన్న విధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు సాగుతున్నారు. కానీ ఆంధ్రాలో ఎన్నికలు ముగియకముందు ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా  ఇలాంటి పరిస్థితి కనిపించడం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే తెలంగాణను చూసి ఆంధ్ర నేర్చుకోవాల్సిన అవసరం ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: