చంద్రబాబు: ఓడినా.. గెలిచినా వారి వళ్లే.. ఆందోళనలో కూటమి..!

Divya
ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికల ఓటింగ్ సోమవారం రోజున ముగిసింది. అయినప్పటికీ అభ్యర్థులలో నేతలలో చాలా ఆందోళన కనిపిస్తోంది. ఎందుకంటే ఈసారి ఓటింగ్ కూడా చాలా ఎక్కువగానే జరగడంతో ఎవరికి ఫేవర్ గా ఉందనే విషయం పైన సర్వత్ర ఉత్కంఠత కనిపిస్తోంది. అయితే అటు పార్టీ అధినేతలు మాత్రం మేము అధికారంలోకి వస్తామంటే మేము వస్తామంటూ తెలియజేస్తున్నారు. తాజాగా జరిగిన ఎన్నికలను గతంలో జరిగిన ఎన్నికలను ఓటు చేస్తూ.. సీనియర్ జర్నలిస్ట్ నరసింహారావు గారు ఒక పాయింట్ ని రైస్ చేశారు. వాటి గురించి చూద్దాం.

మెదక్ కెసిఆర్ సొంత జిల్లా.. తాను అధికారం కోల్పోయిన కూడా.. తన జిల్లాలో మాత్రం పట్టు కోల్పోలేదు. 2023 ఎన్నికలలో కూడా జిల్లాలో మెజార్టీ సీట్లను గెలుచుకున్నారు. జగన్ సొంత జిల్లా కడప.. పార్టీ అధికారం కోల్పోయిన 2014లో కూడా కడప జిల్లాలో మెజార్టీ సీట్లు వైసిపి పార్టీకి వచ్చాయి.. అయితే చిత్తూరు జిల్లా చంద్రబాబుకు సొంత జిల్లా. ఆయన అధికారంలోకి వచ్చిన 1999,2014 లో కుడా చంద్రబాబుకి ఆ జిల్లాల పట్టు దొరకడం లేదు. 1999లో కాంగ్రెస్ 9 స్థానాలు గెలిచింది.. 2014లో కూడా వైసీపీ పార్టీ ఎనిమిది స్థానాలను గెలిచింది.

పాత సాంప్రదాయాన్ని తిరగరాసిన ఈసారి చిత్తూరు జిల్లాని.. చంద్రబాబు పట్టు సాధిస్తే అధికారం ఆయనదే.. ఆయనను గెలిపించిన ఓడించిన చిత్తూరు జిల్లా మెజారిటీ వల్లే అంటూ విశ్లేషకులు సైతం అభిప్రాయంగా తెలియజేస్తున్నరని సీనియర్ జర్నలిస్ట్ నరసింహారావు తెలియజేస్తున్నారు.. ముఖ్యంగా కూటమిలో భాగంగా ఈసారి ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందని చాలామంది భావించారు మరి అందుకు తగ్గట్టుగానే ఈసారి ఓటు ట్రాన్స్ఫర్ అయి కూటమి అధికారంలోకి వస్తుందా రాదా అనే విషయం కూడా కూటమి నేతలను ఆందోళనకు గురిచేస్తోంది. అధికార పార్టీ మాత్రం ఈసారి చంద్రబాబు నియోజకవర్గం కుప్పం కూడా తమ కైవసం చేసుకుంటాం అంటే వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: