ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎవ‌రు ? ఎవ‌రిని ఓడిస్తున్నారా... అంతా గ‌ప్‌చుప్‌...?

RAMAKRISHNA S.S.
రాష్ట్రంలోని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌ను ప‌రిశీలిస్తే.. ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగు చూస్తున్నాయి. ఇక్క‌డ టీడీపీ, వైసీపీ నాయ‌కు లు.. అంత‌ర్మ‌థ‌నం చెందుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. పైకి కొంద‌రు బ‌య‌ట‌కు చెబుతున్నా.. మ‌రికొంద‌రు నాయ‌కులు మాత్రం లోలోన కుమిలిపోతున్నారు. అంటే.. వారు రేపు ఓడినా.. గెలిచినా.. అనే విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. ప్ర‌స్తుతం ఉన్న అంచ‌నా లు.. వారు వేసుకుంటున్న లెక్క‌ల‌ను ప‌రిశీలిస్తే.. త‌మ‌ను ఓడించేందుకు.. త‌మ వారే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని, చేశార‌ని.. వారు ఆరోపించ‌డం గ‌మ‌నార్హం.

దీనికి మంత్రి రోజా చేసిన వ్యాఖ్య‌లు వైసీపీలో బ‌లాన్ని చేకూరుస్తున్నాయి. అయితే..ఈమె ఒక్క‌రే బ‌య‌ట‌ప‌డ‌డం కాదు.. చాలా మంది నాయ‌కులు అంత‌ర్గ‌త స‌మావేశాల్లో వ్యాఖ్య‌లు ఇవే చేస్తున్నారు. కేజే కుమార్ వైసీపీలో ఉండి.. టీడీపీకి ఓటేయాల‌ని ప్ర‌చారం చేశార‌ని.. రోజా బ‌హిరంగ విమ‌ర్శ‌లే చేశారు. ఇక మంత్రి నారాయ‌ణ స్వామి కూడా.. ఇదే త‌ర‌హా వ్యాఖ్య‌లుచేశారు. సొంత వారే త‌నకు ద్రోహం చేశార‌ని అన్నారు. ఆయ‌న కుమార్తె.. కృపా ల‌క్ష్మి గంగాధ‌ర నెల్లూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీలో ఉన్నారు. ఆమె కు స‌రైన ఓట్లు ప‌డ‌లేద‌ని.. ఆయ‌నే స్వ‌యంగా చెప్పారు. దీనికి కార‌ణం.. సొంత పార్టీ వారేన‌ని చెప్పుకొచ్చారు.

ఇదే త‌ర‌హా ప‌రిస్థితి మ‌న‌కు తిరువూరులోనూ క‌నిపించింది. ఇక్క‌డ నుంచి టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసిన కొలిక‌పూడి శ్రీనివాస రావు కూడా.. అంత‌ర్గ‌త స‌మావేశాల్లో ఇదే అభిప్రాయం వ్య‌క్తం చేశారు. చంద్ర‌బాబుత‌న‌ను న‌మ్మి టికెట్ ఇచ్చార‌ని.. కానీ, ఇక్క‌డి వారు త‌న‌ను మోసం చేశార‌ని..ఆ య‌న వ్యాఖ్యానించిన‌ట్టు టీడీపీ వ‌ర్గాల్లో ప్రచారం జ‌రుగుతోంది. ఇక‌, విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో చిత్ర‌మైన పరిస్థితి క‌నిపించింది. ఎన్నికల ప్ర‌చారంలో టీడీపీ నేత‌ల‌ను క‌లుపుకకొని పోయిన కేంద్ర మాజీ మంత్రి, ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త సుజ‌నాచౌద‌రికి చివ‌రి నిముషంలో త‌మ్ముళ్లు హ్యాండిచ్చారు.

అదేవిధంగా కీల‌క‌మైన పిఠాపురంలోనూ.. ఇదే మాట వినిపిస్తుండ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఇక్క‌డ టీడీపీలోనే రెండు వ‌ర్గాలు చీలిపోయాయి. వ‌ర్మ‌కు అనుకూలంగా ఉన్న వ‌ర్గం.. ప‌వ‌న్‌వైపు నిల‌బ‌డింది. కానీ, ఎన్నిక‌ల పోలింగ్కు వారం రోజుల ముందు.. రెండో వ‌ర్గం వేరుప‌డింది. దీంతో ఇక్క‌డ కూడా.. ప‌వ‌న్ కూట‌మి త‌ల‌ప‌ట్టుకుంది. వైసీపీ త‌ర‌ఫున బ‌రిలో ఉన్న తాడేప‌ల్లి గూడెంలో సీనియ‌ర్ నాయ‌కుడు కొట్టు స‌త్య‌నారాయ‌ణ‌కు ఆది నుంచి వైసీపీలోనే వ్య‌తిరేక‌త పెరిగింది. ఆయ‌న‌తో ఉన్న‌వారే.. చివ‌రి నిముషంలో జ‌న‌సేన‌కు అనుకూలంగా మార‌డం .. చిత్రంగా ఉంది.ఇలాంటి వి మ‌రికొన్ని నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయ‌నే చ‌ర్చ సాగుతోంది. దీంతో త‌మ వారే త‌మ‌ను ఓడించేందుకు న‌డుంబిగించ‌డాన్ని నాయ‌కులు తట్టుకోలేక పోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: