ఏపీ: పోలింగ్ శాతంపై అధికారికం..!

Divya
ఆంధ్రప్రదేశ్లోని సార్వత్రిక ఎన్నికలు మే 13 సోమవారం రోజున పూర్తిగా ముగిశాయి.. దీంతో అటు అధికార పార్టీ వైసిపి ప్రతిపక్ష పార్టీ టిడిపి తాము గెలుస్తామంటే తాము గెలుస్తామనే విధంగా మాట్లాడుకుంటున్నారు.. ముఖ్యంగా కొన్ని ప్రాంతాలలో కూడా అల్లర్లు గొడవలు వంటివి జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ కూడా అలా అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి. గత రెండు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఎంత ఓటింగ్ పోలింగ్ అయిందని విషయం పైన సర్వత్ర చర్చనీయాంశం జరుగుతోంది.

తాజాగా రాష్ట్ర ఎన్నికల ప్రధానకారి తెలిపిన సమాచారం మేరకు ఈసారి ఆంధ్రప్రదేశ్లో 80.66 శాతం వరకు పోలింగ్ నమోదయినట్లుగా వెల్లడించారు.. అలాగే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కూడా..1.07 శాతాన్ని కలిపితే మొత్తం మీద..81.73 శాతం వరకు ఉండవచ్చు అంటూ అధికారులు సైతం తెలియజేశారు.. మొత్తం మీద పోస్టల్ బ్యాలెట్ కలుపుకొని 2014లో..78.90 శాతం జరగగా 2019లో మాత్రం..79.80; శాతం వరకు పోలింగ్ నమోదు అయినట్లుగా అధికారులు వెల్లడించారు. మరి ఈసారి కూడా మరింత ఎక్కువగా కావడంతో అటు టిడిపి నేతలు వైసిపి నేతలు ఎవరికి వారు ధీమాని వ్యక్తం చేస్తున్నారు.

మరి పూర్తి సమాచారం తెలియాలి అంటే జూన్ 4వ వరకు ఆగాల్సిందే.. అటు టిడిపి వైసిపి నేతలు సైతం ఎవరు గెలుస్తారనే విషయం పైన చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు.. 2019లో టిడిపి పార్టీ కేవలం 23 సీట్లకే పరిమితమైంది.. వైసిపి పార్టీ 151 సీట్లతో గెలుపొందింది ఈసారి కూడా అధికారం తమదే అంటూ ధీమాతో ఉన్నారు.. ఎన్నో సర్వేలు కూడా వైసిపి పార్టీ నే వస్తుందంటూ వెల్లడించాయి.. అయితే కూటమి కూడా అదే ధీమాతో వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి కొంతమంది నేతలు అయితే ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికారం చేపట్టిన కూడా చాలా కష్టంగానే ఉంటుందంటూ వెల్లడిస్తున్నారు... మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: