ఆత్మ‌కూరు: పార్టీ మారిన ఆనంవోడు పోలింగ్ రోజే చాప చుట్టేశాడే ?

praveen
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ స్థానాలకు, 25 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరుగుతున్నాయ్ అన్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు ప్రచారంతో హోరెత్తించిన ఆయా పార్టీల అభ్యర్థుల భవితవ్యం ఏంటి అన్న విషయాన్ని ఓటర్లు నేటితో తేల్చేశారు. అయితే ఇప్పటికే దాదాపుగా పోలింగ్ పూర్తయిన నేపథ్యంలో ఇక ఏ నియోజకవర్గంలో ఎవరు పై చేయి సాధించారు అనే విషయంపై విశ్లేషకులు అంచనాలు వస్తున్నారు  ఈ క్రమంలోనే ఈసారి నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గంలో ఏ పార్టీ జెండా ఎగరబోతుంది అన్నది ఆసక్తికరంగా మారింది.

 అయితే వైసిపికి గతంతో పోల్చి చూస్తే కొన్ని సీట్లు తగ్గిన మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవడం ఖాయమని ఎన్నో సర్వే రిపోర్ట్ లు చెప్పాయి. ఈ క్రమంలోనే అటు ఆత్మకూరులో కూడా మరోసారి వైసీపీ జెండానే ఎగరబోతుందట. అయితే మొదటినుంచి ఆత్మకూరు నియోజకవర్గం లో టిడిపికి పెద్ద పట్టులేదు. 1983, 1994 ఎన్నికల్లో తప్ప ఇప్పటివరకు  ఇక్కడ టిడిపి గెలిచింది లేదు. కాంగ్రెస్ ఎక్కువసార్లు గెలిచిన.. గత రెండు ఎన్నికల్లో గెలిచిన వైసిపి ఈ నియోజకవర్గాన్ని తమ కంచుకోటగా మార్చుకుంది. అయితే మేకపాటి గౌతంరెడ్డి మరణానంతరం ఉప ఎన్నిక రాగా ఇక గౌతంరెడ్డి తమ్ముడు విక్రమ్ రెడ్డి పోటీ చేసి గెలిచారు.

 ఒకరకంగా చెప్పాలంటే ఆత్మకూరు నియోజకవర్గం వైసీపీకి కంచుకోట కావడం ఇక మేకపాటి ఫ్యామిలీకి మంచి పట్టు ఉండడంతో ఇక్కడ ఆ పార్టీకి తిరిగే లేకుండా పోయింది. అలాంటి కంచుకోటలో మేకపాటి విక్రమ్ రెడ్డిని ఎదుర్కొనేందుకు బరిలోకి దిగారు ఆనం రామ్ నారాయణరెడ్డి. అయితే 2019 ఎన్నికల్లో టిడిపి పై విమర్శలు చేసి వైసిపి లోకి వచ్చిన ఆయన ఇక ఆ తర్వాత వెంకటగిరి సీటు దక్కించుకుని ఘనవిజయాన్ని సాధించారు. కానీ వైసీపీలో ఆయన ఇమడ లేకపోయారు. ఏకంగా సొంత పార్టీ నేతలు పైన విమర్శలు చేయడం.. పార్టీ నేతల మధ్య చిచ్చులు పెట్టడం చేశారు. చివరికి ఇక పార్టీలోని కీలక నేతలను టార్గెట్ చేస్తూ విమర్శలు చేసి వైసిపికి కూడా గుడ్ బై చెప్పి మళ్ళీ సైకిల్ గూటికి చేరారు.

 ఇక ఇప్పుడు ఆత్మకూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అయితే ఈ వైసీపీ కంచుకోటలో ఎవరు పోటీ చేసిన గెలిచే అవకాశాలు తక్కువే. అలాంటి నియోజకవర్గంలో ఆనం పోటీ చేసి గెలుస్తాడా అనే అనుమానాలు నెలకొన్నాయ్. అయితే ఓటమి తప్పదని ముందే అర్థం చేసుకున్న ఆనం ముందు నుంచే చేతులేత్తేసాడు అనే వాదన కూడా వినిపిస్తుంది. ఇక ఇప్పుడు పోలింగ్ రోజు సీన్ మొత్తం అర్థం కావడంతో ఇక ఆనం చాప చుట్టేశాడు అంటూ ఏపీ రాజకీయాల్లో అందరు చర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: