ఓటమి ఫ్రస్టేషన్ తో వైసీపీ నేతలపై దాడులు.. టీడీపీకి ఓటర్ల మనస్సు అర్థమైందిగా!
ఈరోజు ఉదయం నుంచి ఏపీలో ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లు పోటెత్తడంతో పాటు ఓటు వేసినట్టు సెల్ఫీ తీసుకొని సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. ఏపీ 3 గంటల వరకు ఏకంగా 55.49 శాతం పోలింగ్ ఉంది. పోలింగ్ ముగియడానికి మరో 3 గంటల సమయం ఉన్న నేపథ్యంలో ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం భారీగా పెరగనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
అయితే టీడీపీ ఓటమి భయంతో హింసను ప్రేరేపిస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. మాచర్లలో పిన్నెల్లిని టార్గెట్ చేసుకుని టీడీపీ శ్రేణులు దాడికి యత్నించడం గమనార్హం. టీడీపీ నేతల దాడి నుంచి పిన్నెల్లి తప్పించుకున్నా ఆయన కొడుకు గౌతమ్ రెడ్డికి గాయాలు అయ్యాయి. మాచర్లలో టీడీపీ కార్యకర్తలు పోలీసులను సైతం నెట్టేశారని తెలుస్తోంది.
తాడిపత్రిలో అనుమతులు లేకుండా మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి, టీడీపీ రౌడీ షీటర్ పొట్టిరవి పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లారు. ఈ ఘటన గురించి ఎమ్మెల్యే కేతిరెడ్డి ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రకాశం జిల్లాలోని దర్శి మండలం బొట్లపాలెంలో వైసీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. కాకినాడలోని గొల్లప్రోలు టౌన్ లో జనసేన కార్యకర్తలు మహిళను ఏడిపించగా అడ్డుకోబోయిన వైసీపీ కార్యకర్తలపై దాడి చేశారు.
మూడు రోజుల క్రితం ఎంపీ అభ్యర్థి నందిగం సురేష్ పై దాడి చేసిన టీడీపీ శ్రేణులు ఈరోజు పెద్దనక్కలపాలెంలో ఆయన కారుపై దాడికి పాల్పడ్డారు. గన్నవరంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీపై చెప్పులు, రాళ్లతో యార్లగడ్డ అభ్యర్థులు దాడి చేసినట్టు తెలుస్తోంది.